39.2 C
Hyderabad
May 3, 2024 12: 19 PM
Slider ప్రత్యేకం

పెళ్లి చేసుకోకుండా ప్రియురాలికి మొహం చాటేసిన ఎమ్మెల్యే

#bjdmla

ఏవో కారణాలతో మిత్రుల పెళ్లికి వెళ్లలేకపోవచ్చు… బంధువుల ఇట్లో పెళ్లికి వెళ్లలేకపోవచ్చు. మరి అదేమిటో కానీ వీడు తన సొంత పెళ్లికే వెళ్లలేకపోయాడు…. భువనేశ్వర్ లో జరిగిన ఈ సంఘటనలో పెళ్లికి వెళ్లలేకపోయిన పెళ్లి కొడుకు ఎవరో కాదు…. బిజూ జనతాదళ్ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్. BJD ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్, అతని స్నేహితురాలు తమ పెళ్లి కోసం భువనేశ్వర్ లోని వివాహ రిజిస్ట్రార్ కార్యాలయానికి మే 17 న దరఖాస్తు చేసుకున్నారు.

ఎమ్మెల్యే ప్రియురాలు పెళ్లి లాంఛనాల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకుంది కానీ సదరు ఎమ్మెల్యే మాత్రం తన పెళ్లికి తాను రాలేదు. 30 రోజులు గడిచినా ఎమ్మెల్యే కనిపించలేదు. సుమారు మూడు గంటల పాటు ఎమ్మెల్యే కోసం ఎదురుచూసిన మహిళ ఆ తర్వాత తిరిగి వచ్చి తనకు జరిగిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది .దాస్‌తో తనకు మూడేళ్లుగా రిలేషన్‌షిప్ ఉందని, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, తీరా మోసం చేశాడని ఆ మహిళ చెప్పింది.

ఎమ్మెల్యే సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది. అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు… నా ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వడం లేదు…. అంటూ ఆమె వాపోయింది. మహిళ ఆరోపణలపై పోలీసులు ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా BJD ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను పెళ్లికి ఎప్పుడూ నిరాకరించలేదని స్పష్టం చేశాడు.

తాను వివాహ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసి ఒక నెల గడిచిందని ఇంకా 60 రోజుల సమయం ఉందని అతను చెప్పాడు. మరో 60 రోజుల్లో ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఎమ్మెల్యే అంటున్నాడు. “ప్రస్తుతం మా అమ్మ అనారోగ్యంతో ఉంది, అందుకే పెళ్లికి వెళ్లలేకపోయాను’’ అంటున్నాడు. పెళ్లి విషయాన్ని నేనే మీడియా ముందు, ప్రజల ముందు ప్రకటించాను.

కాబట్టి మోసం అనే ప్రశ్న తలెత్తదు అని కూడా అతను అంటున్నాడు. మీడియా కథనాల ప్రకారం, ఆ ఎమ్మెల్యే చాలా కాలంగా ఆ మహిళతో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే కొద్ది రోజుల కిందట వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆ మహిళ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది, ఆ తర్వాత అతను పెళ్లికి సిద్ధమయ్యాడు….. అయితే ఆఖరు నిమిషంలో పెళ్లికి రాకుండా పోయాడు.

Related posts

కరోనాతో మృతి చెందిన పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి

Satyam NEWS

ఇక హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్-స్టాప్ విమానం

Satyam NEWS

శ్రీనివాస్ శర్మ కుటుంబానికి టి.డి.పి ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment