38.2 C
Hyderabad
May 3, 2024 22: 13 PM
Slider విజయనగరం

ఛలో నర్సీపట్నం… ఎక్కడిక్కడే టీడీపీ నేతలు హౌస్ అరెస్టు

#tdp

రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ‘ఛచో నర్సీపట్నం’ పిలుపు మేరకు టీడీపీ నేతలు అంతా అందున ఉత్తరాంధ్ర కు చెందిన నేతలంతా సన్నద్ధం అవుతున్న సందర్భంలో ఒక్కసారిగా పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో టీడీపీ నేతలు ఇళ్ల నుంచీ కదలకుండా హౌస్ అరెస్టు లు చేస్తున్నారు.

ఈ మేరకు డా.కొండపల్లి అప్పలనాయుడు, రెబల్ నేత మీసాల గీత..పార్టీ కి చెందిన ఇతర నేతలను ఇళ్ళ వద్దే అడ్డుకున్నారు. ఇక ఛలో నర్శీపట్నం భగ్నం కలిగించే ప్రయత్నంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కె.ఏ.నాయుడు ని అరెస్ట్ చేసేందుకు కంటోన్మెంట్ వద్ద ఉన్న ఆయన్ను అడ్డుకున్నారు. అరెస్టు అయిన వారిలో అయ్యన్నపాత్రుడు కి మద్దతుగా నర్సీపట్నం వెళ్తున్న విజయనగరం నియోజకవర్గ బిసి  నాయకులను  చోడవరం నియోజకవర్గం వడ్డాది జంక్షన్ లో డిఎస్పీ పోలీసులు అడ్డుకుని వారిని బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయినవారిలో 

1) కర్రోతు వెంకట నర్సింగరావు, నగర పార్టీ అధ్యక్షులు

2) బొద్దుల నర్సింగరావు, మండల పార్టీ అధ్యక్షులు

3) కనకల మురళీమోహన్, పార్లమెంట్ అధికార ప్రతినిధి

4) కంది మురళీనాయుడు, రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి

5) గంటా పోలినాయుడు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి

6) ప్రసాదుల లక్ష్మి వర ప్రసాద్, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి

7) తుంపిల్లి రమణ, మాజీ జడ్పీటీసీ

8) వేచలపు శ్రీను, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి

9) కోరాడ వెంకటరావు, పార్లమెంట్ బిసి సెల్ ఉపాధ్యక్షులు

10) గడి శ్రీను, పార్లమెంట్ బిసి సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి

11) కోండ్రు శ్రీను, విజయనగరం నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు

12) నడిపల్లి రవి, మాజీ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి

13) ఆల్తి బంగారుబాబు, పట్టణ కమిటీ మాజీ కార్యదర్శి

14) లంక శంకరరావు, విజయనగరం పట్టణ బిసి సెల్ అధ్యక్షులు

15) పాండ్రంకి గౌరీ సూరప్పడు, విజయనగరం నియోజకవర్గ బిసి సెల్ ఉపాధ్యక్షులు ఉన్నారు.

Related posts

మధ్యవర్తులు డబ్బు డిమాండ్ ఆడియో టేప్ ను కలెక్టర్ కు ఇచ్చిన బి.జి.ఆర్

Satyam NEWS

సూర్యాపేట జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పై  చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

హిందువుల పట్ల విద్వేషం కక్కుతున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment