40.2 C
Hyderabad
April 29, 2024 17: 54 PM
Slider జాతీయం

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్

ఆర్మీ నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్​కు నిరసనగా నేడు కొన్ని సంస్థలు భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి. దీంతో రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్​ (ఆర్​పీఎఫ్​), గవర్నమెంట్​ రైల్వే పోలీసుల (జీఆర్​పీ) అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్త్​ ఏర్పాటు చేశారు.

కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్లో చేపట్టనున్న నియామకాలను అగ్నిపథ్​ స్కీము ద్వారానే చేపట్టనున్నట్టు ప్రకటించింది. దీంతో ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. అగ్నిపథ్​ని వాపస్​ తీసుకోవాలని, తక్కువ వయస్సుకే ఆర్మీ అభ్యర్థులను పరిమితం చేస్తే తమ భవిష్యత్​ ఆగమైతుందని ఇప్పటికే పలు రకాల పరీక్షలు ఎదుర్కొన్న అభ్యర్థులు అంటున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ దేశ వ్యప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు, నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఉత్తరప్రదేశ్​, బీహార్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ జార్ఖండ్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించారు.

ఆందోళనకారుల తీరుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడా తగ్గడం లేదు. ఆందోళనలను మరింత విస్తృతం చేస్తున్నారు. అందులో భాగంగా నేడు దేశ వ్యాప్త బంద్​కు ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు పిలుపునిచ్చారు. దీంతో పలు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్​ విధించాయి. ప్రజలు, యువకులు, విద్యార్థులు గుమిగూడి కనిపించవద్దని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఆయా రాష్ట్రాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Related posts

ఏఐమ్ ఆధ్వర్యంలో ఘనంగా 71వ రాజ్యాంగ దినోత్సవం

Satyam NEWS

కార్డన్ సెర్చ్: కంచికచర్లలో పోలీసుల కొత్త ప్రయోగం

Satyam NEWS

ప్రతి ఏడాది పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్

Murali Krishna

Leave a Comment