42.2 C
Hyderabad
May 3, 2024 15: 05 PM
Slider ఆదిలాబాద్

గ్యాస్ లీక్ ప్రమాదాన్ని గోప్యంగా ఉంచుతున్నారు

#BJP Kagaznagar

గ్యాస్ లీక్ ప్రమాదాన్ని చిన్నదిగా చేసి చూపించేందుకు, గోప్యంగా ఉంచేందుకు SPM యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ అన్నారు. కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీఎం పేపర్ మిల్లులో క్లోరిన్ గ్యాస్ లీక్ అయిన సమయంలో ఇరవై మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు.

అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాగజ్ నగర్ పట్టణంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లి SPM కార్మికుడు నాగుల రాజం ను పరామర్శించారు. జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగినపుడు కార్మికులను ఆసుపత్రికి పంపకుండా ఇంటికి పంపించి ప్రమాద విషయాన్ని గోప్యంగా ఉంచారని SPM యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగుల రాజాం ని ఇతర కార్మికులని SPM యాజమాన్యం అన్నివిధాల ఆదుకోవాలని SPM పరిశ్రమలో మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి ఇసుకెళ్తామని హెచ్చరించారు. ఆయన తోపాటు పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్, మెడి కార్తిక్, శరద్ శర్మ, మాచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related posts

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళామణులకు సన్మానం

Satyam NEWS

ప్రతి ప్రైవేట్ ల్యాబ్ ధరల పట్టికను తప్పనిసరిగా ప్రకటించాలి

Satyam NEWS

ఈ మంత్రులా ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడేది?

Satyam NEWS

Leave a Comment