31.7 C
Hyderabad
May 2, 2024 07: 29 AM
Slider జాతీయం

జనవరి 31 వరకు స్కూల్స్ క్లోజ్

కరోనాకు పగ్గాల్లేకుండా పోయాయి. సామాన్య జనం నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఎవరినీ వదలడం లేదు. మహారాష్ట్రలో ఏకంగా పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడం కలకలం సృష్టిస్తోంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా ముంబై మహానగరంలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల నేపథ్యంలో పాఠశాలను జనవరి 31వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మున్సిపల్ కార్పొరేషన్. ఒకటి నుంచి 9వ తరగతులకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

అలాగే పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు కొనసాగుతాయని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. అయితే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసులను నిర్వహించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

రిక్వెస్ట్: తీసుకున్నరుణాలన్నీవందశాతం తిరిగి చెల్లిస్తా

Satyam NEWS

రఘురామపై ‘లాకప్ దాడి’ కేసులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS

జర్నలిస్ట్ శ్రీనివాస్ కు నివాళి

Satyam NEWS

Leave a Comment