37.2 C
Hyderabad
May 6, 2024 12: 59 PM
Slider నిజామాబాద్

రైతులను వ్యాపారులుగా మార్చడానికే వ్యవసాయ చట్టాలు

#BJPKamareddy

రైతులను వ్యాపారులుగా మార్చడానికే రైతు చట్టాలు రూపొందించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ తెలిపారు. నెల రోజులుగా రైతు బిల్లులపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని, బిల్లులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రైతులను రైతులుగానే ఉంచడానికి ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దేశం మొత్తంలో ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో పంజాబ్, హర్యానా రైతులు తప్ప ఇతర రాష్ట్రాల రైతులు లేరన్నారు.

నిజమైన రైతులు నిరసన చెప్పడం లేదని, వారు చట్టాలకు అంకుకులంగా ఉన్నారని తెలిపారు. బీజేపీని వేలెత్తి చూపించడానికి మాత్రమే ఈ నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులపై రాజకీయ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు.

కొత్త చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతు పండించిన పంట ఎక్కడైనా రైతుకు నచ్చిన ధరకు అమ్ముకునే స్వేచ్ఛను ఈ చట్టం కల్పిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఉన్న మార్కెట్ యార్డులను తొలగించడం లేదని స్పష్టం చేశారు.

రైతులను ప్రేరేపిస్తున్నవారు రైతులను రైతులుగానే ఉండాలని చూస్తున్నారని తెలిపారు. రైతుల ద్వారా వారికి 2500 కోట్ల ఆదాయం వస్తుందని, అది ఎక్కడ పోతుందోనని భయపడుతున్నారన్నారు. రైతులు పండించిన పంట ఇంటర్నేషనల్ మార్కెట్ కు వెళ్ళాలని తెలిపారు.

దేశంలో ఉన్న 55 శాతం మంది రైతులకు ఉపయోగపడే చట్టమని, రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ చట్టానికి మద్దతివ్వాలని కోరారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారికి అర్థమయ్యేలా చెప్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి బాణాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు

Related posts

మైనర్‌పై అత్యాచారం: 9 రోజుల్లో తీర్పు.. 20 ఏళ్ల శిక్ష

Sub Editor

మంత్రి కారు ఢీకొని ఒకరి మృతి: బాధితుల ధర్నా

Satyam NEWS

పాకిస్తాన్ లో మళ్లీ సైనిక పాలన తప్పదా?

Satyam NEWS

Leave a Comment