33.7 C
Hyderabad
April 29, 2024 02: 56 AM
Slider ప్రత్యేకం

కాసుల కక్కుర్తి తో నరకం చూపిస్తున్న వ్యవస్థ

#corruption

కాసుల కక్కుర్తి తో ప్రభుత్వ కార్యాలయాలు నరకం చూపిస్తున్నాయి. రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్ల శాఖ, పౌరులకు సేవలు అందించే ప్రతి కార్యాలయంలో కాసులు లేకుండా కాగితం బయటికి రాదు. ఇలాంటి వ్యవస్థలో సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాల కంటే నరక లోకమే మేలు,నరక లోకమే స్వర్గంలా ఉంది అన్న చందంగా వ్యవస్థలు మారాయి.

దేశంలోనే అత్యున్నత స్థాయి సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అధికారులు డిమాండ్ చేస్తున్న అనధికార వసుళ్లపై లంచం తీసుకోవడం అధికారికంగా ధ్రువీకరిస్తే బాగుండు అని హాస్యాస్పద వ్యాఖ్యలు గతంలోనే వ్యాఖ్యానించినట్టు కథనాలు విన్నాం.నరక లోకం అంటే ఎక్కడో లేదని, ప్రభుత్వ కార్యాలయాలే నరక లోకం  అంటే అందులో పని చేసే అధికారులే యమకింకరులని సామాన్యుడు ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నాడు.

చెప్పుకున్నా తీర్చేవాడు ఆర్చేవాడు లేడు. ప్రతి కార్యాలయంలో పౌరసేవా పత్రం ఏర్పాటు చేయాలని నిబంధన ఉన్న ఎక్కడ అమలు లేదు.సామాన్యుడు ఎండనకా, వాననకా, ఎన్నో కష్టాలు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఓ పూట తిన్నా తినకున్నా ఒక్కో రూపాయి పక్కకు వేస్తూ చిన్న ఆస్తిని కొనుక్కున్న దానికి రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకో చట్టంలో మార్పులు, నాయకులు తన కుటుంబం చేతిలోనే అధికారం ఉండాలని దురాశకు సామాన్యుడిని బలి చేస్తున్నారు.

అధికారాల కోసం ఒక వంతు అయితే, అది నాది అని నిరూపించుకోవడానికి కూడా అదే ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. ఏ అధికారిని సంప్రదించిన న్యాయం జరగదు. న్యాయస్థానాల్లో వెలువడిన తీర్పులను కూడా బేఖాతరు చేస్తున్నారు అధికారులు. సామాన్యుడు ఒక కాగితం కావాలంటే చిన్న కార్యాలయం నుండి పెద్ద కార్యాలయం వరకు చిన్న అధికారి నుండి పెద్ద అధికారి వరకు చేతులు తడపాల్సిందే చేతులు తడవాల్సిందే. ఇటువంటి వ్యవస్థలో జీవించడం కంటే చావే మేలని సామాన్యుడు రోదిస్తున్నాడు.

కానీ ఆ సామాన్యుడికి ఓ లోకం కావాలి. ఆ లోకంలో కాసులు ఉండకూడదు. ఉన్న అవి బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపే విధంగా ఉండాలి. 500 నోటు అసలే ఉండకూడదు. 50 రూపాయలకు మించి ఉండకూడదు. అటువంటి లోకం సామాన్యుడికి కావాలి. లేదంటే భవిష్యత్తులో సామాన్యుడు అనే పదమును డిక్షనరీలో తొలగించాల్సిందే. రానున్న రోజుల్లో ఒకప్పుడు డైనోసర్లు ఉండేవని ఎలా చెప్పుకుంటున్నామొ భవిష్యత్ తరాల వారు ఒకప్పుడు సామాన్యుడు కూడా ఈ భూమి మీద నివసించేవాడని చెప్పుకోక తప్పదేమో.

Related posts

చెత్త రాజకీయాలు ఊడ్చేస్తున్న ‘చీపురు’ కు పదేళ్లు

Satyam NEWS

ఉపాధిహామీ బిల్లులను చెల్లించకపోతే హైకోర్టు ను ఆశ్రయిస్తాం

Satyam NEWS

సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సరికొత్త విధానం

Satyam NEWS

Leave a Comment