23.2 C
Hyderabad
May 7, 2024 19: 26 PM
Slider ఆదిలాబాద్

ఉద్యోగులకు టీచర్లకు సంఘీభావంగా బిజెపి ఆందోళన రేపు

#BJPNirmal

ఉద్యోగులకు, టీచర్లకు 2018 జూలై నుండి పీఆర్ సీ పెండింగ్ లో ఉందని వారికి కనీసం మధ్యంతర భృతి కూడా చెల్లించడం లేదని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మోరపెళ్లి సత్యనారాయణ రావు అన్నారు. దీనికి నిరసనగా రేపు జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఉద్యోగులు, పెన్షనర్లు టీచర్లకు న్యాయబద్ధంగా రావలసిన I R, పి ఆర్ సి లపై టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జరిగే ధర్నా కార్యక్రమానికి పెన్షనర్లు ఉద్యోగ సంఘ నాయకులు టీచర్లు పార్టీకి చెందిన వివిధ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఆఫీస్ బేరర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

లోటు బడ్జెట్ లో ప్రారంభమైన పక్క రాష్ట్రంలో మధ్యంతర భృతి 27% చెల్లిస్తున్నారని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సకల జనుల సమ్మెలో పెద్దఎత్తున ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయక మధ్యంతర భృతి చెల్లించక నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు.

టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. పీ ఆర్ సీ అమలయ్యే వరకు పెద్ద ఎత్తున పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని  అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడి ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వీర బత్తిని అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిల్లా సత్యనారాయణ, బీజేపీ జిల్లా కోశాధికారి సుంకేటి  దశరథ్ రెడ్డి

బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్ నాయకులు కొక్కుల గణేష్ పెద్ద గంగారం నారాయణ రెడ్డి ప్రభాకరు  బీజేవైఎం నాయకులు జగదీష్ రవితేజ రాజేందర్ సాయి కృష్ణ రాజేష్ పవన్ సింగ్ కవుడ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రోత్సాహకాలు

Satyam NEWS

బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన కాయకల్ప బృందం

Satyam NEWS

పర్ఫెక్ట్ ఫైట్: నేను ఒక్క కిక్ ఇస్తే గాల్లో ఎగురుతావ్

Satyam NEWS

Leave a Comment