28.7 C
Hyderabad
April 28, 2024 04: 13 AM
Slider శ్రీకాకుళం

పర్ఫెక్ట్ ఫైట్: నేను ఒక్క కిక్ ఇస్తే గాల్లో ఎగురుతావ్

srikakulam fighting

పైన ఫొటోలు చూసి ఏమనుకుంటున్నారు? సినిమా షూటింగ్ స్టిల్స్ అనుకుంటున్నారా? కానే కాదు. ఇవి నిజమైన ఓరిజినల్ ఫైట్స్. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని ఓ కాలేజీలో నేడు ఈ ఫైటింగ్ సీక్వెన్స్ జరిగింది. ఒక  జూనియర్‌ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బైక్‌తో ఢీ కొట్టడంతో ఈ గొడవ ప్రారంభమైంది.

ఈ విద్యార్థులు సినిమా ఫైటింగ్‌ను తలదన్నే రేంజ్‌లో కొట్టుకున్నారు. సాక్ష్యాత్తూ వారు చదువుకుంటున్న కాలేజీ ముందే ఈ ఫైటింగ్ సీక్వెన్స్ జరిగింది. ఒక్కొక్కడూ ఫ్లయింగ్ కిక్ లు, ఓవర్ జెంప్ షాట్స్, బ్యాక్ కిక్ లు, పవర్ కిక్ లతో మూతులు పగలకొట్టుకున్నారు. గాల్లో లేచి కాలితో కిక్ ఇస్తుంటే ప్రత్యర్థి పదడుగుల దూరంలో పడుతున్నాడు.

వాడు లేచి మళ్లీ చెయ్యిని కత్తిలా ప్రయోగించి బ్లో చేస్తే ఎదుటి వాడి తల గింగిరాలు తిరిగింది. ఈ ఫైటింత్ తో మెయిన్‌రోడ్డులో ట్రాఫిక్ జామ్‌ అయింది. ఈ ఫైటింగ్‌ వల్ల గంట సేపు ట్రాఫిక్ జామ్‌ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పోలీసుల దృష్టికి వచ్చింది.

మెయిన్‌ రోడ్డు వద్ద విద్యార్థులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయపడిపోయారు. వీధి రౌడీల్లా వారు కొట్టుకుంటోన్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాలకొండ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Related posts

అసలు జీ జెన్ పింగ్ కు ఏం జరిగింది?

Satyam NEWS

Shock to AP BJP: పార్టీని వదిలిన కన్నా లక్ష్మీనారాయణ

Satyam NEWS

సామాజిక సమరభేరికి రాష్ట్ర మంత్రులు.. అందులో ముగ్గురు  డిప్యూటీ సీఎం లు..!

Satyam NEWS

Leave a Comment