32.2 C
Hyderabad
May 8, 2024 14: 33 PM
Slider రంగారెడ్డి

రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బిజెపి ధర్నా

#BJPChowdariguda

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రేపు ఉదయం 10.00గంటలకు ధర్నా  కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చౌదరిగుడా మండల కిసాన్ మోర్చ అధ్యక్షుడు రవిందర్ రెడ్డి ఎల్కాగుడా తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి పంటలను మార్చి వారిని తీవ్ర నష్టాలకు గురి చేసిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట విని రాష్ట్రమంతా రైతులు సన్న వడ్లు పెట్టారని అయితే పంట దిగుబడి రాగానే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనడం లేదని ఆయన అన్నారు.

అదేవిధంగా రైతుకు మద్దతు ధర క్వింటాలుకు 25 వందల చొప్పున ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఫసల్ భీమాను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదు. బ్యాంకులలో రైతులకు రుణమాఫీ చేయడం లేదు. అదేవిధంగా రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడం లేదు.

సకాలంలో విత్తనాలు అందడం లేదు. ఎరువులు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ఎరువులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి హామీలను అమలు పరచడం లేదు.

దీనికి రేపు 10 గంటలకు రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బిజెపి మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది.

Related posts

క‌రోనా నిబంధనల నేపథ్యంలో పైడితల్లి ఉత్స‌వాల‌కు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

మహాకాళేశ్వర ఆలయంలో కోహ్లీ అనుష్క శర్మ పూజలు

Satyam NEWS

పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు

Satyam NEWS

Leave a Comment