29.7 C
Hyderabad
April 29, 2024 07: 04 AM
Slider గుంటూరు

పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు

#LavuKrishnadevarayalu

పల్నాడులో కార్మికులకు మేలు జరిగేందుకు తాము చేసిన కృషి ఫలించనుందని, చిలకలూరిపేటలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని ఎంపీ లావు  శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నేడు ఆయన ప్రెస్‌ మీట్‌ నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈఎస్‌ఐలు కట్టే వారు అధికంగా ఉండటం, కార్మికులు ఎక్కువ ఉన్నందున పేట ప్రాంతంలో ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు.

అనువైన స్థలం కోసం జిల్లా కలెక్టర్‌ శోధిస్తున్నారని, స్థల ప్రక్రియ పూర్వవ్వగానే ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుందని ఎంపి తెలిపారు.

ఎంతో కాలంగా వేచి ఉన్న కొండమోడు పేరేచర్ల, దాచేపల్లి, మాచర్ల మార్గాలు జాతీయ రహదారులుగా గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ మార్గంలో త్వరలోనే 4 వరసల రహదారిగా విస్తరణ కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం…రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో  వైసీపీ ప్రభుత్వం నిర్మిరామంగా కృషి చేస్తుందని ఆయన తెలిపారు.

ఆంధ్రుల సంకల్పం.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, క్యాపిటివ్‌ మైన్స్‌ కేటాయించండం, ప్లాంట్‌పై ఉన్న రుణాలను తగ్గించడం ద్వారా విశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

Related posts

ప్రధాని సలహాలు సూచనలు పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి పాటించాలి

Satyam NEWS

డొనేషన్: రేషన్ బియ్యాన్ని విరాళంగా ఇవ్వండి

Satyam NEWS

గణేష్ మండపాల ఏర్పాటు అనుమతించేది లేదు

Satyam NEWS

Leave a Comment