26.7 C
Hyderabad
April 27, 2024 08: 06 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి బంధువు?

#Telangana CM KCR 2

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ పార్టీ కష్టాలలో పడినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లుగా ఉంది. ఎలాగైనా మళ్లీ ప్రజల మద్దతు సంపాదించాలని కొత్త ప్లాన్ లు వేస్తున్నారు.

అయితే తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు భూస్వాముల పంట పండే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఎకరాలకు సంబంధం లేకుండా రైతు బంధు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.

సామాన్య రైతుల పేరుతో  భూస్వాములకు మేలు చేస్తున్నారని అంటున్నారు. అన్ని పార్టీలలో భూస్వాములు ఉండవచ్చు, అందుకే ఈ అంశంపై నోరు మెదపడం లేదని విశ్లేషిస్తున్నారు. రాజకీయ నాయకులకు  మేలు చేకూర్చి తమ పార్టీ వైపు మలుపు కోవడం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇండైరెక్టుగా వందల ఎకరాలు ఉన్న రైతులకు లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా ఇస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు.

భూ స్వాములకు మేలు చేసేందుకు….

రూ.7,300కోట్లు రైతుల  ఖాతాలో ఈ నెల 27నుండి  జమచెయ్యాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఆ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మేధావులు. ఇది వరకే మొదటి సారి అందరికి రైతుబంధు పథకాన్ని  వర్తింప చేసి భూస్వాముల జేబులు నింపారు.

మళ్ళీ ఇప్పుడు అదే పని చేస్తున్నారని అంటున్నారు. ఇందులో సామాన్య  రైతులకు మాత్రమే రైతు బంధువు పథకాన్ని  వర్తింపచేసి మిగిలిన బడ్జెట్ తో కౌలు రైతులను గుర్తించి వారికి మేలు చేసేవిధంగా నిర్ణయం తీసుకోవాలని, అదే విధంగా నిరుద్యోగులను గుర్తించి నిరుద్యోగ భృతి అందచేయాలని అంటున్నారు.

ప్రభుత్వానికి కౌలు రైతుల బాధలు పట్టవా?

గత సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం అయ్యారు. ఈసందర్భంగా 7,300కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ రైతులకు ఈ నెల 27 నుంచి రైతుబంధు ఇవ్వాలని  ఆదేశాలిస్తూ అందులో చిన్నా,పెద్ద రైతులు అనే తేడా లేకుండా అందరికీ  రైతుబంధు ఇవ్వాలని  ఆదేశించారు.

అయితే ఈ రైతు బంధువు ద్వారా భూస్వాములకు మేలుచేసే విధంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. అన్ని పార్టీలలో ఉన్న భూస్వాములకు మేలుచేసి కౌలు రైతుల  పొట్టగొట్టేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెబుతున్నారు.

ఇలా పంచి పెడితే ఆర్ధిక సంక్షోభమే

ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మరింత  ఆర్థిక సంక్షోభంలోకి  వెళ్లే పరిస్థితి కనిపిస్తోందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

వందల ఎకరాలు ఉన్న వారిని రైతులు అనే కంటే భూస్వాములు అంటే బాగుంటుందని విశ్లేషకులు అంటున్నారు. కౌలు రైతులు భూస్వాముల ద్వారా అప్పులు చేసి వారికే వడ్డీలు కట్టలేక పండించిన పంటలో సగభాగం ఇస్తున్నారు. మళ్ళీ భూస్వాముల జేబులను నింపే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. వంద ఎకరాలకు  రైతుబంధు ద్వారా  లక్షలపైనే ఇస్తున్నారు.

ఉదాహరణకు ఒక ఎకరాకు ఐదు వెయ్యిల చొప్పున వంద ఎకరాలకు ఐదు లక్షల రూపాయలు  ఇస్తున్నారు.అదే ఐదు,పది ఎకరాలు ఉన్న రైతులకు 25,50వేలు ఇస్తున్నారు.

ఇక రెండు మూడు ఎకరాలకు పది నుంచి పదిహేను వేలు ఇస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఈ ప్రభుత్వం ఎవ్వరికి మేలు చేస్తున్నట్లో ప్రజలు అర్థం చేసుకోవాలని మేధావులు, విశ్లేషకులు అంటున్నారు.

నిరుద్యోగుల సమస్య ప్రభుత్వానికి గుర్తుకురాదా?

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని వందల మంది త్యాగాలు చేశారు. రాష్ట్ర ఏర్పాటుతో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు చాలా వున్నారు. ఇప్పటికి అరేండ్లు గడిచినా నిరుద్యోగుల ఆశలు ఆవిరి అయ్యాయి.

ఇప్పుడు వీరి బాధలు   ప్రభుత్వానికి  కనిపించడం లేదు. కానీ వందల ఎకరాలు కలిగిన భూస్వాములకు పదే పదే మేలు చేస్తున్నారు. ఇది ప్రజల సొమ్మనే అంశాన్ని ఈ ప్రభుత్వం మరిచిపోవద్దని మేధావులు,విశ్లేషకులు అంటున్నారు. తమస్వార్థ రాజకీయాల లబ్ధికోసం ప్రజధన్నాన్ని భూస్వాముల పాలు చెయ్యరాదని అంటున్నారు.

ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధును వర్తింప  చేస్తే బాగుంటుందని అంటున్నారు. వందల ఎకరాలు కలిగిన భూస్వాములకు రైతుబంధును వర్తింప చేస్తే  ప్రభుత్వం భూస్వాములకు కొమ్ము కాస్తున్నట్లేననీ ప్రజలు అర్థం  చేసుకోవాలని  అంటున్నారు.

ఇలా అయితే  భూస్వాములు భూస్వాములుగానే, నిరుద్యోగులు నిరుద్యోగులుగానే  మిగిలిపోతారని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం ప్రజాధనం విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి మేధావులు,విశ్లేషకులు సూచిస్తున్నారు.

అవుట రాజశేఖర్

Related posts

కొల్లాపూర్ డివిజన్ టిఎన్జీవో సంఘం ఎన్నికలు పూర్తి

Satyam NEWS

రాజధాని మార్పుపై నరసరావుపేటలో భారీ ర్యాలీ

Satyam NEWS

గవర్నర్ తో ‘‘సై’’ అంటున్న అధికార పక్షం

Satyam NEWS

Leave a Comment