38.2 C
Hyderabad
May 5, 2024 22: 39 PM
Slider నిజామాబాద్

కరెంటు చార్జీలు తగ్గించాలని బీజేపీ ధర్నా

#bjpkamareddy

పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో రైతులకు 24గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు MRO కి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మొటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి వ్యవసాయదారులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిదని కానీ  కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని అన్నారు.

మొదట 24 గంటలు, తర్వాత 18 గంటలు, మొన్నటి వరకు 12 గంటలు కరెంటు ఇచ్చిందని కానీ ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి కోతలు ఇంకా పెరిగాయని ఆయన తెలిపారు. చేతికొచ్చిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదనీ పంటలు నష్టపోకుండా 24 గంటల విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

పట్టణ అధ్యక్షుడు విపుల్ మాట్లాడుతూ తెలంగణలో  విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి నేడు పేద, బడుగు, బలహీన వర్గాల పై పెద్ద మొత్తంలో గత 20 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా   చార్జీలు పెంచడాన్ని బీజేపీ ఖండిస్తుందని అన్నారు.

పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు బీజేపీ ఉద్యమాలు చేస్తుందని అన్నారు. రైతుల పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎండలు ముదిరిన తర్వత పంటలకు నీటి సమస్య వచ్చే విధంగా కరెంటు కోతలు సరి కాదని అన్నారు.

Related posts

సముద్ర గర్భంలో ఏలియన్స్ రూపంలో లార్వాలు ..

Sub Editor

సుప్రీంకోర్టుకు చేరిన జోషిమఠ్ భూమి కుంగుబాటు అంశం

Bhavani

నాగర్ కర్నూల్ కలెక్టర్ గా ఎల్ శర్మన్ నియామకం

Satyam NEWS

Leave a Comment