40.2 C
Hyderabad
April 26, 2024 14: 20 PM
Slider ప్రత్యేకం

చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా…ఈ ప్ర‌భుత్వాన్ని భ‌ర్త‌ర‌ఫ్ చేయండి….!

#telugudesham

కేంద్ర మాజీమంత్రి అశోక్ గ‌జ‌ప‌తి బంగ్లాలో  టీడీపీ సీనియ‌ర్ నేత ఐవీపీ రాజు డిమాండ్….!

మూడేళ్ల‌లో ఏపీలో క‌రెంట్ చార్జీలు విప‌రీతంగా పెంచి…దాదాపు 12 వేల కోట్ల‌భారాన్ని ప్ర‌జ‌ల‌పై ర‌ద్దుని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా.. 1400 కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల పెంపు లో బాగంగా మోపింద‌ని విజ‌య‌న‌గ‌రం  టీడీపీ పేర్కొంది.. చేతులెత్తి  జోడిస్తున్నామ‌ని..త‌క్ష‌ణం..ఈ ప్ర‌భుత్వాన్ని భ‌ర్త‌ర‌ప్ చేయాల‌ని టీడీపీ సీనియ‌ర్ నేత  విజ‌య‌న‌గ‌రం నియోజ‌క వ‌ర్గ ఇంచార్జ్ ఐవీపీ రాజు డిమాండ్ చేసారు.

ఈ మేర‌కు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఐవిపీ రాజుతో పాటు ఇత‌ర టీడీపీ నేత‌లుసంయుక్తంగా మాట్లాడారు. మా  అన్న వ‌స్తాడు…మా క‌ల‌లు నెర‌వేరుస్తుడాని చూసిన రాష్ట్ర  ప్రజ‌ల‌కు విద్యుత్ చార్జీల పెంపుతో ఎన‌లేని  భారం  వేసారని ఆరోపించారు.  2019లో  ఫ్యాన్ కోసం రాష్ట్ర ప్ర‌జ‌లు ఓటేసి గెలిపిస్తే…ఈ రోజుఆదే  ఫ్యాను వేసుకోలేని పరిస్థితిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చింద‌న్నారు.

ఆ రోజు చంద్ర‌బాబు క‌రెంట్ విష‌యంలో బాదుడే బాదుడు అంటూ..దాదాపు మూడు నిమిషాలు సాగ‌దీసింది.టీడీపీ.ఈ సంద‌ర్బంగా నాడు క‌రెంట్ చార్జీల‌ను పెంచార‌ని టీడీపీ ప్ర‌భుత్వంపై పెద్ద పెద్ద ఆరోప‌ణ‌లు చేసిన జ‌గ‌న్..ఈ రోజు అధికారంచేప‌ట్టి మూడేళ్లు అవుతున్నా విద్యుత్ చార్జీలను విప‌రీతంగా పెంచ‌డం ఎంత‌వ‌వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

ఖడ్గం  సినిమాలో  హీరోయిన్ సంగీత ఒక్క ఛాన్స్ ఇవ్వ‌మ‌ని చెప్పిన‌ట్టుగా..జ‌గ‌న్ కు ఒక్క అవ‌కాశం ఇస్తే….ఏకంగా రాష్ట్రాన్ని లూఠీ కి పాల్ప‌డే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టార‌ని  విమర్శించారు. ఇటువంటి త‌రుణంలో స‌రైన నాయ‌కుడు రావాల‌ని..అదే చంద్ర‌బాబు నాయుడు రావ‌ల‌ని ప్ర‌జ‌లంతా కోరుతున్నార‌ని టీడీపీ అభిప్రాయ ప‌డింది.

విద్యుత్ చార్జీల పెంపును నిర‌సిస్తూ..విద్యుత్ భ‌వ‌న్ వ‌ద్ద ధ‌ర్నా

ప్ర‌జ‌ల‌పై అద‌నంగా మరో 1400 కోట్ల భారాన్ని విద్యుత్ చార్జీల పెంపుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం భారం వేసింద‌ని టీడీపీ విమ‌ర్శించింది. ఈ విద్యుత్ రేట్లు పెంపున‌కు నిర‌స‌న‌గా ఈ నెల 1 న న‌గ‌రంలోని విద్యుత్ భ‌వ‌న్ వ‌ద్ద  ద‌ర్నా త‌ల‌పెట్టిన‌ట్టు టీడీపీ పేర్కొంది.నేనున్నానంటూ…జ‌గ‌న్ చెప్పి శుష్క వాగ్దానాల‌ను న‌మ్మిన ప్ర‌జ‌ల‌కు  మూడేళ్ల తర్వాత జ‌గ‌న్ పెట్టి పార్టీ సంగ‌తి…సీఎం సంగ‌తి ఏంటో తెలిసింద‌ని టీడీపీ పేర్కొంది.

న‌వ‌రత్నాలు..అమ్మ ఒడి ,జ‌గ‌న‌న్న  విద్యా దీవెన‌, జ‌గ‌న‌న్న నేస్తం..రైతు భరోసా వంటి ప‌ధ‌కాలు పెడుతూనే…అటు ల‌బ్దిదారుల నోట్లోనూ,ఇటు సామాన్య‌లు నోట్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ట్టి కొట్టింద‌ని ఆరోపించారు. పేద‌ల‌కు అండ‌…జ‌గ‌న‌న్న దండు అంటూ…విద్యుత్  చార్జీలు పెంచి…అటుపేద‌లు,ఇటు సామాన్యుడ న‌డ్డి విర‌గొట్టార‌ని ఆరోపించింది.ఈ పెంచిన విద్యుత్  చార్జీల‌కు నిర‌స‌న‌గా..ఏప్రిల్ 1న విద్యుత్ భ‌వ‌న్ వ‌ద్ద టీడీపీ  ద‌ర్నా  నిర్వ‌హిస్తోంద‌ని..అంద‌రూ పాల్గొనాల‌ని టీడీపీ పిలుపు ఇచ్చింది.

Related posts

ఉత్తమ్ కు రాఖీ కట్టిన ఆయన సోదరి

Satyam NEWS

బూతులతో రెచ్చిపోయిన పోలీసు కానిస్టేబుల్

Satyam NEWS

గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది

Satyam NEWS

Leave a Comment