39.2 C
Hyderabad
May 3, 2024 12: 38 PM
Slider ముఖ్యంశాలు

నీటి బోర్డులపై కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ స్వాగతించాలి

#vishnuvardhanreddy

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నిర్ణయం పట్ల బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో నీటి దొంగలు ఎవరో తేలిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ఆర్ అక్రమ ప్రాజక్టులతో నీటి చౌర్యం చేస్తున్నారని ఆయన అన్నారు. అదే విధంగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్రమ విద్యుత్ ఉత్పత్తి చేశారని ఆయన అన్నారు.

నీటిచౌర్యం, అక్రమ విద్యుత్ఉత్పత్తి చేయకుంటే  కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకోచ్చిన అంతర్ రాష్ట్ర జల వివాదాల ప్రాజక్టుల పరిరక్షణ  నిర్ణయాన్ని ఎందుకు   వ్యతిరేకిస్తున్నారు ? అని ఆయన ప్రశ్నించారు.

నీటి దొంగలు ఎవరు అనేది ప్రజలకు తెలుస్తుందని మీరు భయపడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు దోంగలెవరో, దోరలెవరో ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు, నేతలు దొంగే  దొంగా..దొంగా అని అరచినట్లు ఉందనే విషయం నేడు అందరికి తెలిసిపోయిందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి తప్పు చేయకపోతే కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఎన్నిక‌ల సంఘం అవార్డు

Satyam NEWS

రాష్ట్ర రైతాంగానికి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

పి వి సింధు కు పతకం రావటంతో ఖమ్మంలో సంబురాలు

Satyam NEWS

Leave a Comment