27.7 C
Hyderabad
April 30, 2024 10: 02 AM
Slider వరంగల్

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

#anurag

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని స్వయంకృషి వృద్ధ ఆశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. చలి విపరీతంగా ఉండడంతో వృద్ధులు ఇబ్బంది పడుతున్నందున దుప్పట్లు ఏర్పాటు చేసినట్లు అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా. కె.అనితారెడ్డి తెలిపారు. తమ అత్తగారు కరుకాల విమలమ్మగారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వృద్ధుల సేవ దైవ సేవేనని, తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడూ భారంగా అనిపించవద్దని అది బాధ్యతగా భావించాలని అన్నారు. వృద్ధాప్యం ఎవరికి తప్పదని అది మరచిపోవద్దని అన్నారు. కోట్ల సంపాదన పేరుతో తల్లిదండ్రులను వదిలేసి విదేషాల వెంట పరుగులు తీస్తున్నారని, కోట్లు సంపాదించినా  తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోనివారు అనాధలు, నిత్య దరిద్రులేనని అన్నారు. ఎవరికి వృద్ధాప్యం భారం కాకూడదని అన్నారు. వృద్ధులను గౌరవించడం, ప్రేమించడం అంటే మన సంస్కారాన్ని, ఔన్నత్యాన్ని చాటుకోవడమేనని అన్నారు. ప్రతి ఒక్కరు వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలని అనితారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కె.అనితారెడ్డి, కరుకాల విమలమ్మ రాంరెడ్డి, వృద్ధులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా డైరీ సంచిక ప్రధాని మోడీ కి అంకితం

Satyam NEWS

రిజర్వేషన్ల పెంపు కోసం కోటి సంతకాల సేకరణ

Bhavani

జపాన్ లో ప్రవాసులపై మోడీ సమ్మోహనాస్త్రం

Satyam NEWS

Leave a Comment