33.2 C
Hyderabad
May 4, 2024 02: 51 AM
Slider వరంగల్

సర్వర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి విశేష స్పందన

రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం వలన ప్రాణదానం చేసినట్లని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు,శుక్రవారం కమ్యూనిస్టు నేత కామ్రేడ్ సర్వర్ 35వ వర్ధంతి సందర్భంగా చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ ఆధ్వర్యంలో ములుగు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు,ఈ శిబిరాన్ని ఫాతిమా మహమ్మద్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, శిబిరానికి 96 మంది యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు, ఈ రక్తదాన శిబిరలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా రక్తదాన చేశారు, అనంతరం తస్లీమా మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో మార్పుల వలన పిల్లలు, గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతూ మరణిస్తున్నారని,రక్తం నిల్వ లేక ప్రమాద భారిన పడిన వారికి, శస్త్రచికిత్స సమయంలో రక్తం దొరకక మృత్యువాత పడుతున్నారని, అలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తస్లీమా తెలిపారు, ఈ కార్యక్రమంలో సర్వర్ చారిటబుల్ ట్రస్టు & పౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.

Related posts

ఆపద సమయంలో మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణం

Bhavani

దొరల పాలనలో రోడ్లపైకి ఆడపడుచులు

Satyam NEWS

ఈ చీకట్లు త్వరలోనే తొలగిపోతాయి

Satyam NEWS

Leave a Comment