29.7 C
Hyderabad
May 3, 2024 03: 28 AM
Slider మహబూబ్ నగర్

లాభసాటి వ్యాపారాలను ఎంచుకోని జీవితంలో రాణించాలి

దళితులు సంఘటితంగా ఉంటూ రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక సుఖ జీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నాగర్ కర్నూలు నియోజకవర్గ 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు అవగాహన సదస్సును జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగింది.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….
ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను ఎంచుకొని అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. దళితులు ఆర్థికంగా ఎదగడం కోసమే ఈ పథకం అమల్లోకి తెచ్చారని చెప్పారు.
అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఒకే రకమైన వ్యాపారాలు కాకుండా దళితులు సంఘటితంగా ఏర్పడింది వ్యాపారాలు చేయాలని సూచించారు.
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 43 మంది ట్రాక్టర్ల కొనుగోలుకు నమోదు చేసుకున్నారని, ఒకే రకమైన వ్యాపారాలు కాకుండా లాభసాటిగా ఉండే వ్యాపారాలు నేర్చుకోవాలని సూచించారు.
సమావేశంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…..
దశాబ్దాలుగా అణగారిన దళిత జీవితాల్లో వెలుగులు నింపి, శాశ్వతంగా వారి పేదరికాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి  కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని పథకాన్ని కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతుందన్నారు.
ఇతర రాష్ట్రాల్లోను దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఆయా రాష్ట్రాల దళిత నాయకులు ఆయా ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఎలాంటి అపోహలకు తావు లేకుండా దళిత బంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించే 10 లక్షల ఆర్థిక సహకారంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని, దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
పథకానికి ఎంపికైన లబ్ధిదారులు లాభసాటి వ్యాపారాలు చేసుకుంటూ గొప్పగా ఎదగాలని సూచించారు.
పాలకు భారీ డిమాండ్‌ ఉందని, నిత్యవసరాల డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతుందన్నారు.
అందుకు అనుగుణంగా వ్యాపార రంగాల నిర్మించుకోవాలన్నారు.
దళితబంధు కింద ఇస్తున్న యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మూడు తరాలు వెనక్కి వెళ్లామని, దీన్ని మార్చాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్‌ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.
ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి మనకు సీఎం కావడం అదృష్టమని, ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానన్నారు.
ఈనెల 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజున కొంతమంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు అందించేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
లబ్ధిదారులు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా తనను అధికారులను కలెక్టర్ను సంప్రదించాలని సూచించారు.
దళిత రక్షణ నిధి దళిత కుటుంబాలకు దోహదపడుతుందని తెలిపారు.
అంతకుముందు జిల్లా అధికారులతో లబ్ధిదారులు ఎంచుకన్న వ్యాపార రంగాల్లో రాణించేలా అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్క లబ్ధిదారుని మాట్లాడిస్తూ అవగాహన కల్పించారు.
నియోజకవర్గంలోని నాగర్ కర్నూల్, బిజినపల్లి, తిమ్మాజిపేట, తాడూర్, తెలకపల్లి మండలాలకీ 20 మంది చొప్పున 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
పదిమంది మినీ డైరీ, 11మంది పౌల్ట్రీ ఫోరమ్,11 మంది వివిధ రకాల రిటైల్ షాప్లు,15 మంది సర్వీస్ మరియు అప్లై రంగాల్లో,53 మంది రవాణా రంగాలను ఎంచుకున్నారు.
ఆయా వ్యాపార రంగాల్లో రాణించేలా అధికారులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్ లాల్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, పరిశ్రమల అధికారి హనుమంతు ఆర్టిఓ ఎర్రిస్వామి, డిఆర్డిఓ నరసింహారావు, వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు నాగర్ కర్నూల్ ఎంపీపీ నరసింహారెడ్డి, జడ్పిటిసి శ్రీశైలం, తెలకపల్లి ఎంపీపీ కొమ్ము మధు, బిజినపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, వివిధ శాఖల అధికారులు లబ్ధిదారులు ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్, కొల్లాపూర్

Related posts

టిడిపి నేతలపై అక్రమ కేసులను ఖండిస్తున్నాం

Satyam NEWS

Special Story: విశాఖ పోర్ట్ పైనా కరోనా ప్రభావం

Satyam NEWS

[Free|Trial] Weight Loss Pills For Women Consumer Reports Lose Weight Fast Diet Pills That Work Best Weight Loss Pills Worldwide

Bhavani

Leave a Comment