33.7 C
Hyderabad
April 29, 2024 02: 30 AM
Slider మహబూబ్ నగర్

ఆపద సమయంలో మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని సంఘం ఫంక్షన్ హాలులో ఎర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజం కోసం,దేశం కోసం,రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు.ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు.వారి త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు.

పేదప్రజలు,బాధితులకు సత్వర న్యాయం అందించడం,ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు.థలసేమియా,క్యాన్సర్,హిమోఫీలియా,రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి,ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని,రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా మనకు కూడా మంచి చేకూరుతుందని అని అన్నారు.

రక్తదానం మహాదానమని,రక్తదానంపై అపోహలు వద్దని ఎస్పీ అన్నారు.ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడానికి ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ఉపయోగపడుతుందని తెలియజేసారు.ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి ప్రతీ 5 నెలలకొకసారి రక్తదానం చేయడం ద్వారా శరీరం మరింత ఉత్సాహవంతంగా మారుతుందని అన్నారు.

ఈ రక్తదాన శిబిరంలో జిల్లాలోని పోలీసు అధికారులు, వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పీ, ఆనంద్ రెడ్డి, వనపర్తి పట్టణ ఎస్సై, యుగంధర్ రెడ్డి, మదనపూర్ ఎస్సై, మంజునాథ్ రెడ్డి, పెబ్బేరు ఎస్సై, రామస్వామి, పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు, మహిళలు, పత్రిక మీడియా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా 207 మంది రక్తదానం చేశారు.

22వ సారి రక్తదానం చేసిన వనపర్తి అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్, 5వ సారి రక్తదానం చేసిన వనపర్తి డిఎస్పి, ఆనంద రెడ్డి, 9వ సారి రక్తదానం చేసిన వనపర్తి పట్టణ ఎస్సై, యుగంధర్ రెడ్డి, 17వ సారి రక్తదానం చేసిన మదనాపూర్ ఎస్సై , మంజునాథ్ రెడ్డి, 81వ సారి రక్తదానం చేసిన పోచ రవీందర్ రక్తదానం చేశారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారికి ఎస్పీ అభినందనలు తెలియజేశారు.

రక్తదానం చేసిన రక్త దాతలకు ప్రశంషా పత్రం పండ్లు,గ్రుడ్డు, పంపిణీ చేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా 207 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని,ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన వనపర్తి జిల్లా,పరిసర ప్రాంతాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పీ, ఆనంద్ రెడ్డి, వనపర్తి సీఐ, ప్రవీణ్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాసచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్,జగన్ వనపర్తి పట్టణ ఎస్సై, యుగంధర్ రెడ్డి,ఎస్పీ పీఆర్వో, రాజగౌడు, రెడ్ క్రాస్ చైర్మన్, ఖాజ కుద్బుద్దీన్, రెడ్ క్రాస్ స్ సెక్రెటరీ,కృష్ణ సాగర్, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్, రాజేందర్ కుమారు, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, అహ్మద్, విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియా మిత్రులు జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు,

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

20 రోజుల్లో లక్ష మందికి ఐఐటి జెఈఈ, నీట్ సమాచారం

Satyam NEWS

మంచి మాట చెప్పి బాట చూపిన మహనీయులు

Satyam NEWS

యాదాద్రికి పోటెత్తిన భక్తులు…

Satyam NEWS

Leave a Comment