33.2 C
Hyderabad
May 4, 2024 02: 55 AM
Slider ప్రత్యేకం

ఎవరికి పుట్టారో తెలియదు….(తిరుపతి దొంగ ఓట్ల కథ)

#tirupati

ఎవరికి పుట్టారో తెలియదు…. నిజం… ఈ వాక్యం కఠినంగా ఉన్నా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో దొంగఓట్లు వేసిన వారిని ఇంతకన్నా సౌమ్యంగా చెప్పడం కుదరదు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని తెలుగుదేశం, బిజెపిలు డిమాండ్ చేస్తున్నాయి.

చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనుషుల్ని తెచ్చి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయించుకున్నారు. వేలాది బస్సులలో దొంగ ఓటర్లను తరలించారు. వారికి మాత్రమే స్లిప్పులు వచ్చేలా చేసుకున్నారు.

నిజమైన ఓటర్లకు ఓటర్ స్లిప్ లు రాకుండా జాగ్రత్త పడ్డారు.

ఇది ఎలక్షణా అనే రీతిలో ప్రవర్తించారు. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఈ అక్రమాలను బిజెపి నేతలు పట్టుకున్నారు.

బిజెపి నాయకురాలు శాంతా రెడ్డి ఒక్క పోలింగ్ బూత్ లోనే పది మంది వరకూ దొంగ ఓటర్లను పట్టుకున్నారు. నీ పేరు ఏమిటి? స్లిప్ లో చూసి సమాధానం చెబుతున్నారు.

నీ తండ్రి పేరు ఏమిటి? అని అడిగితే సమాధానం లేదు. తండ్రి పేరు తెలియకుండానే పుట్టి ఓటు వేయడానికి వచ్చిన ఈ యువకులు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గత వారం రోజులుగా తిరుపతిలో వాలంటీర్లు తమ వద్ద ఉన్న డేటా బేస్ కు కరోనా తీవ్రంగా విస్తరిస్తున్నట్లు మెసేజీలు పంపారు.

ఓటర్లను భయబ్రాంతుల్ని చేశారు. నిజమైన ఓటర్లు పోలింగ్ బూత్ లకు రాకుండా చేశారు. దొంగ బస్సుల్లో వచ్చిన వారితో ఓట్లు వేయించుకున్నారు.

ఇదీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరిగిన తీరు. ఇదే ప్రజాస్వామ్యమా?

Related posts

నెహ్రూ విధానాలే సర్వదా ఆచరణీయం

Bhavani

కేసీఆర్, రేవంత్ రెడ్డి గెలిస్తే లోకల్ గా ఉండలేరు

Satyam NEWS

సీనియర్ ఐఏఎస్ అధికారులతో చెలగాటం

Satyam NEWS

Leave a Comment