30.7 C
Hyderabad
April 29, 2024 06: 28 AM
Slider విజయనగరం

వేక్సిన్ వేయించుకొని.. జాగ్రత్తలు పాటించి..క్షేమంగా ఉండాలి

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి కోవిడ్ వాక్సినేషను గురించి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు మాట్లాడుతూ – ప్రస్తుతం, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాంప్తంగా, జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని, కోవిడ్ నుండి వైరస్ నుండి రక్షణ పొందేందుకు కోవిడ్ పై ఫ్రంట్ లైను వారియర్స్ గా పోరాటం చేస్తున్న పోలీసు ఉద్యోగులకు కోవిడ్ వేక్సినను వేయించేందుకు జిల్లా ఎస్పీ  రాజకుమారి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారని, ఈ అవవకాశాన్ని సద్వినియోగపురుచుకొని, పోలీసు సిబ్బంది, అధికారలు ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు మట్లాడుతూ – కోవిడ్ 2వ దశలో ప్రమాదకరంగా మారిందని, కోవిడ్ నుండి రక్షణ పొందేందుకు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు.. భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, శానిటైజర్ తో గాని సబ్బుతో గాని చేతులను తరుచూ శుభ్రపరుచుకోవడంతో పాటు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

ఎన్నో వైద్య పరీక్ష లు నిర్వహించిన తరువాత ప్రభుత్వం కోవిడ్ వేక్సినను వేసేందుకు చర్యలు చేపట్టిందని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి ప్రజల కోసం సేవ చేసే ప్రతి ఒక్క పోలీసు ఉద్యోగి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

జిల్లాలో కోవిడ్ బారిన పడి 6గురు పోలీసు సిబ్బందిని, కొంతమంది పోలీసు కుటుంబాల సభ్యులను కోల్పాయమన్నారు. వేక్సినేషనుకు ముందు ఎన్నో పరీక్షలు నిర్వహించి, కోవిడ్ 19 వైరస్ పై బాగా పని చేస్తుందని నిర్ధారించిన తరువాతనే వేక్సినేషను ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందన్నారు.

వేక్సినేషను పై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, 18 ఏళ్ళు నిండని పిల్లలు, గర్భిణిలు, బాలింతలు తప్ప మిగతా వారందరూ కోవిడ్ వేక్సిన్ వేసుకోవచ్చునన్నారు. పోలీసు ఉద్యోగులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రజల మద్య ఉండి విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి, ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలన్నారు.

ప్రతీ ఒక్కరూ ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే వైద్యుల సలహాలను పొందాలన్నారు. ప్రోజెక్ట్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీం  డా.బాల మురళి కృష్ణ మాట్లాడుతూ – కోవిడ్ వేక్సిన్వే యించకోవడం వలన మానవ శరీరంలో ఎంటీబాడీస్ ఉత్పత్తి అయి, కోవిడ్ వైరస్ రాకుండా కాపాడుతుందని, ప్రాణనష్టాన్ని నివారించవచ్చునన్నారు.

కోవిడ్ వేక్సిన్ వేయించుకోవడం వలన ఎటువంటి నష్టం కలగదన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కోవిడ్ నియంత్రణకు నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న పోలీసు ఉద్యోగులు కోవిడ్ వేక్సిస్ ను తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. వేక్సినేషను కరోనా నియంత్రణలో బాగా పని చేస్తుందన్నారు.

వేక్సిన్ వేసుకోవడంలో ఎవరికైనా ఏమైనా అపోహలు ఉన్నా, తీసుకున్న తరువాత ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమను సంప్రదించవచ్చునన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రోజెక్ట్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీం (మెడికల్ ఆఫీసరు) డా. మురళీ కృష్ణ, ఎఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సీఐ జి.రాంబాబు, ఆఱలు చిరంజీవి, బి.నాగేశ్వరరావు, బి.రమణమూర్తి, కుమార్ పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో డీసీఆర్బీ ఒక్క‌ రోజు నివేదిక….!

Satyam NEWS

రాణిగారి గదిలో దెయ్యం ట్రైలర్‌ ఆవిష్కరణ

Satyam NEWS

ముఖ్యమంత్రికి రెవెన్యూ అధికారుల ధన్యవాదాలు

Satyam NEWS

Leave a Comment