33.7 C
Hyderabad
April 29, 2024 01: 17 AM
Slider ప్రపంచం

ఆకాశంలో ఆందోళన: విమానానికి బాంబు బెదిరింపుతో ఉత్కంఠ

#mahanair

ఒక విమానం ఇరాన్ లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళ్తున్నది. మార్గమధ్యంలో ఆ విమానంలో బాంబు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ఇరాన్ విమానం భారత గగనతలం గుండా వెళుతున్నప్పుడు అందులో బాంబు ఉన్నట్లు భారత భద్రతా ఏజెన్సీలకు ట్రిగ్గర్ అలర్ట్ వచ్చింది. దాంతో మహాన్ ఎయిర్ ఆందోళన చెంది ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఏటీసీని సంప్రదించింది.

ఢిల్లీలో వెంటనే ల్యాండింగ్ చేస్తామని కూడా కోరారు. అయితే ఢిల్లీలో విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ఢిల్లీ విమానాశ్రయం ఏటీసీ అంగీకరించలేదు. విమానాన్ని జైపూర్‌కు తీసుకువెళ్లాలని వారు సూచించగా, విమాన పైలట్ అందుకు నిరాకరించాడు. భారత గగనతలం నుంచి విమానాన్ని తీసుకుని అతను వెళ్లిపోయాడు. అయితే భారత్ తన బాధ్యతను విస్మరించలేదు.

తక్షణమే పంజాబ్‌కు చెందిన రెండు సుఖోయ్ యుద్ధ విమానాలను ఇరాన్ విమానాన్ని అనుసరించేందుకు భారత్ ఏర్పాటు చేసింది. భారత భద్రతా సంస్థలు విమానాన్ని పర్యవేక్షిస్తున్నాయి. ఈ విమానం ఇప్పుడు చైనా వైపు కదులుతోందని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Related posts

ఫేక్ కాల్: మహిళ కిడ్నాప్ అయింది రండి

Satyam NEWS

అంబరాన్నంటిన “అట్లాంటా-నెల్లూరు” సాంస్కృతిక సంబరాలు

Satyam NEWS

Vermont Cbd Hemp

Bhavani

Leave a Comment