34.2 C
Hyderabad
May 14, 2024 23: 09 PM
Slider ముఖ్యంశాలు

ఎన్.టి.ఆర్ స్టేడియంలో 35వ జాతీయ పుస్తక ప్రదర్శన

#oldcity

35వ జాతీయ పుస్తక ప్రదర్శన 22 డిసెంబరు 2022 నుఁడి 1st జనవరి 2023 వరకు తెలంగాణ కళాభారతి ఎన్.టి.ఆర్ స్టేడియంలో జరుగుతుంది. అనేక పుస్తకాలు స్టాల్స్ లో  అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్టాల్ నెంబర్ 270 పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో “పాలపిట్ట’ నుంచి ప్రచురించిన అనేక కవులు, కవయిత్రుల కవితలు, కథల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే హైదరాబాద్ పాతనగర కవుల వేదిక నుంచి ప్రచురితమైన కవితల సంపుటాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావు శతజయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వము భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమి, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక ఆధ్వర్యంలో ప్రచురితమైన “కాలాతీతుడు” భరతమాత ముద్దుబిడ్డకు ఘన నివాళిగా సమర్పించిన పుస్తకాలు, యువతీయువకులకు ఎంతో ముఖ్యంగా అవసరపడే “ఊహలకే ఊపిరొస్తే” “రాగమోహనం” మొంబత్తి, కవన మంజరి లాంటి కవితల సంపుటాలు అందుబాటులో ఉంటాయి. 50 శాతం తగ్గింపు ధరతో ఇవ్వదలిచామని, పాఠకులు సద్వినియోగపరుచుకోగలరని ఆశిస్తున్నామని హైదరాబాద్ పాతనగర కవుల వేదిక కార్యదర్శి తెలిపారు.

Related posts

కలిసి కొట్లాడకపోతే మిగిలేది ఉక్కు కాదు బూడిద

Satyam NEWS

అమృత మూర్తులార….

Satyam NEWS

దేవాలయంలో పని చేస్తున్న కుటంబాలకు ఆర్ధిక సాయం

Satyam NEWS

Leave a Comment