35.2 C
Hyderabad
May 1, 2024 02: 48 AM
Slider కవి ప్రపంచం

అమృత మూర్తులార….

#K.Haranath New Photo

గురువులార

కరుణామృత ధీరులార

ప్రతి గుండె గుండె నిలిచి

సరస్వతిని వశపరిచిన

అపర బ్రహ్మలార

మీ కటాక్ష వీక్షణాలు

మా ఉన్నతికి

గవాక్ష రక్షణ కవచాలు

మీ సేవా భావ కిరణాలు

మాపై నిరతం కురిసే

చల్లని వెన్నెల పున్నములు

మీ అనితర విధి నిర్వహణలు

మా భవిష్యకు నిధి నిక్షేపాలు

గురుదేవోభవ

మరిచిపోదామన్నా మరువలేని

మనసున్న మా రాజులు మీరు

మేము వేస్తున్న ప్రతి అడుగులో

మీ అమూల్య జాడలే

మీరందించిన, అందించే

అపురూప ఆదరణలు

కుసుమించే సుమ మాలలు

భావితరానికి రూపురేఖలు

దిద్దుతున్న మార్గదర్శులు

మా హృదిలో నిలిచిన అమృతమూర్తులు

మీకివే వందనాలు

వందనాలు

వందలాది వందనాలు

(5 సెప్టెంబర్ 2021 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)

కె.హరనాథ్, 9703542598

Related posts

గంజాయితో పట్టుబడిన ఇంజినీరింగ్‌ విద్యార్థులు

Satyam NEWS

ఈ నెల 6నుండి 13వరకు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

Satyam NEWS

స్థానికుల‌చే మొక్కలు నాటించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment