26.7 C
Hyderabad
May 1, 2025 05: 42 AM
Slider గుంటూరు

భోగి మంటలకే పనికి వచ్చే బోస్టన్ కమిటీ నివేదిక

ntr tdp 14

బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదిక పత్రాలను అమరావతి పరిరక్షణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో భోగి మంటల్లో వేసి కాల్చేశారు. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.

3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గా అమరావతిని మాత్రమే కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజల నుంచి ఎటువంటి అభిప్రాయాలు సేకరించకుండా బోగస్ నివేదిక అందజేసిన ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలు బోగి మంటలకు మాత్రమే పనికి వస్తాయని డాక్టర్ చదలవాడ అన్నారు.

నరసరావుపేట పట్టణంలో స్థానిక 27 వ వార్డు లోని శివుని బొమ్మ సెంటర్ లోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ అరవింద బాబు తోబాటు 27 వ వార్డు ప్రెసిడెంట్ కాకుమాను వెంకట్రావు, కోడూరు రాము, 29 వ వార్డ్ ప్రెసిడెంట్ వనమా పవన్ కుమార్ వార్డ్ లోని కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలని నరసరావుపేట జేఏసి ముక్త కంఠంతో డిమాండ్ చేసింది.

Related posts

ఇస్రో నుంచి విద్యార్ధులు సృష్టించిన ‘ఆజాది శాట్’ ప్రయోగం

Satyam NEWS

రామప్ప ముంపు బాధితులకు సేవా భారతి సేవలు

Satyam NEWS

Breaking News: నాగర్ కర్నూల్ జిల్లాలో కరోనా రికార్డు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!