31.7 C
Hyderabad
May 2, 2024 07: 59 AM
Slider విజయనగరం

ఏబీ6′ క్యాలండర్ ఆవిష్కరణ సందర్భంగా ఎమ్మెల్యే ఏం మాట్లాడాలంటే…?

#Calendar2021

రాష్ట్రంలో బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్ కే చెల్లిందని విజయనగరం ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు.

బ్రాహ్మణ సంఘం నేతృత్వంలో నిర్వహిస్తున్న ab 6 యూట్యూబ్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా చానల్ ఆధ్వర్యంలో ముద్రించిన సనాతన ఆధ్యాత్మిక కేలండర్ ను శనివారం నాడు ఎమ్మెల్యే కోలగట్ల చేతుల మీదుగా తన నివాసంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి మరియు బ్రాహ్మణుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేయడం ఎంతైనా అభినందనీయమన్నారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం, కుల అభివృద్ధి కోసం పనిచేస్తూ  మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ధార్మిక బంధువులకు తెలియజేయడం ఆనందకర మన్నారు.

సీఎం జగన్ బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తే, గత పాలకులు ఐదు శాతం రిజర్వేషన్ కోత విధించారు అని అన్నారు.

సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి 10 శాతం రిజర్వేషన్ కొనసాగుతోందన్నారు. జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్యాత్మిక కార్యక్రమాల తో పాటు సమాజ సేవ లో ముందు ఉండడం అభినందనీయమన్నారు.

సంఘం అధ్యక్షులు కేపీ ఈశ్వర్ నేతృత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతూ సంఘ ప్రతిష్టకు ఎంతో కృషి చేస్తున్నారు అని అన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కోలగట్ల కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కె పి ఈశ్వర్, ఉపాధ్యక్షులు టీవీ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి  జి వి శ్రీనివాస్, కోశాధికారి పి. గుర్రాజు పంతులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పు సరోజిని, జిల్లా ఉపాధ్యక్షులు మోతడక మురళి, జాయింట్ సెక్రటరీ రాపాక చంద్రశేఖర్, నగర ప్రధాన కార్యదర్శి ద్వాదశి వేణు, గంటి మార్కండేయ శర్మ లు పాల్గొన్నారు.

Related posts

ఆర్య వైశ్యులకు ఉచితంగా కరోనా మందు పంపిణి

Satyam NEWS

విధినిర్వహణలో మానవత దృక్పథంతో మెలగాలి

Satyam NEWS

లాక్ డౌన్ సమయంలో తిరగవద్దు అంటే వింటారా? వినరు…అందుకే…

Satyam NEWS

Leave a Comment