26.7 C
Hyderabad
April 27, 2024 07: 01 AM
Slider నల్గొండ

అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి : డిఐజి రంగనాధ్

#DIGRanganath

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది అంతా విధిగా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ సూచించారు.

దేశ వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న క్రమంలో పోలీస్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి శనివారం నుండి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇందులో భాగంగా డిఐజి ఏ.వి.రంగనాధ్ కు డిఎంహెచ్ఓ కొండల్ రావు మాన్యం చెల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేశారు. 

ఈ సందర్భంగా డిఐజి ఏ.వి. రంగనాధ్ మాట్లాడుతూ ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా వ్యాక్సిన్ రూపొందించి ప్రపంచ దేశాలకు భారతదేశం తలమానికంగా నిలించిందన్నారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఎవరూ భయపడవద్దని సూచించారు.

యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేలా వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని, దేశ ప్రజలంతా వారి కృషికి వెన్నంటి నిలిచారని చెప్పారు.

పోలీస్ శాఖలో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది విధిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించినట్లు తెలిపారు.

అదనపు ఎస్పీ నర్మద, సతీష్ చోడగిరి, డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, సిఐలు, ఎస్.ఐ.లు, హెడ్ కానిస్టేబుల్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా శనివారం జిల్లా పోలీసు శాఖలో తొలి వ్యాక్సినేషన్ డిసిఆర్బీ సిఐ రవీందర్, కోర్టు లైజనింగ్ అధికారి శ్రీనివాస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Related posts

అనంత్ నాగ్ జిల్లాలో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం

Satyam NEWS

‘ఊరు ఊరుకి జమ్మి చెట్టు’ గొప్ప కార్యక్రమం

Satyam NEWS

రైతాంగ పోరాట చరిత్రలో నిలిచిన గుండ్రాపల్లి

Satyam NEWS

Leave a Comment