32.2 C
Hyderabad
May 9, 2024 14: 06 PM
Slider మహబూబ్ నగర్

విద్యా వాలంటర్ లని వెంటనే పున:నియామకం చేయాలి

#MinisterNiranjanReddy

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విద్యా వాలంటర్ లను రెన్యూవల్ చేసే అంశం పై ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం  విడుదల చేయాలని కోరుతూ వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఉన్న  విద్యా వాలంటీర్ లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిద్దిక్,మీడియా సెల్ ఇంచార్జ్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర లో 12600 మంది  విద్యా వాలంటర్ లు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి  కృషి చేస్తున్నారని, అనేక సంవత్సరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతు కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. 

వారిని కాదని ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులతో  హైస్కూల్ విద్యార్థులకు బోధన చేయించడం వల్ల విద్యార్థులకు పాఠాలు అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. కరోన సంక్షోభం వల్ల వారి జీవనం దుర్భరంగా మారిందని,ఉపాధ్యాయ వృత్తి తప్ప ఇంకొ పని చేయాలేని స్థితిలో విద్యా వాలంటర్ లు ఉన్నారని వారిని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వెంటనే నవీకరణ (రెన్యూవల్)ఉత్తర్వులు ఇవ్వాలని    మంత్రిని కోరారు.

కరోన ప్రారంభంలో  ముఖ్యమంత్రి కె .సి .ఆర్.  చెప్పినట్లు ప్రభుత్వ సంస్థలో పనిచేసే అందరి సిబ్బందికి కరోన కాలంలో వేతనాలు ఇవ్వాలనే ప్రతిపాదన ఇంకా అమలుకు విద్యా వాలంటీర్లు నోచుకోలేదన్నారు . కరోన కాలానికి  విద్యా వాలంటీర్ లకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి  ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కృషి చేసే   విద్యా వాలంటర్ల సేవలు గుర్తించి  రెన్యూవల్ (నవీకరణ)చేసి రాష్ట్ర ప్రభుత్వం  కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి మంత్రిని కోరారు. కార్యక్రమంలో విద్యా వాలంటీర్లు  మధు,భగవంతు,బాలనాగయ్యా , అమరేష్, రాములు, మౌలాలి, అరుంధతి, మహేష్, శ్రీను,భీముడు, రవి పాల్గొన్నారు. పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

కరోనా ఎఫెక్ట్: ఏపి భవన్, తెలంగాణ భవన్ క్లోజ్

Satyam NEWS

అవయవదానంతో అమరుడైన రాజేశ్వరరావు

Satyam NEWS

మంగళగిరిలో అనుమానితుల సంచారం

Sub Editor

Leave a Comment