28.7 C
Hyderabad
April 27, 2024 03: 37 AM
Slider కడప

బాబాయి హత్య తర్వాత తలకు కుట్లు వేసిన వ్యక్తి విచారణ

#kadapa police

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి హత్య కేసులో సీబీఐ వేగంగా అడుగులు వేస్తున్నది.

బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన అనంతరం అక్కడ రక్తం తుడిచివేయడం, ఆయన తల గాయాలకు కుట్లువేయడం లాంటి పనులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కోణంలో దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు కీలకమైన వ్యక్తిని పిలిచి విచారణ జరిపారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి తండ్రి అయిన ఇసి గంగిరెడ్డి ఆసుపత్రి లో కాంపొండర్ గా పనిచేస్తున్న ప్రకాష్ రెడ్డి ని పిలిచి నేడు విచారణ జరపడం కీలకమైన మలుపుగా చెప్పవచ్చు.

పులివెందులలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సిబిఐ విచారణ కు  ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ప్రకాష్ రెడ్డి వైఎస్ వివేకా కు కట్టు కట్టిన వ్యక్తి గా చెబుతున్నారు.

69వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతున్నది. కడప కేంద్ర కారాగార అతిథి గృహం, పులివెందుల ఆర్.అండ్.బి అతిథి గృహం కేంద్రాలు సీబీఐ విచారణ కొనసాగుతున్నది. భరత్ యాదవ్ నేడు విచారణకు హాజరైన వారిలో ఉన్నాడు.

వైసీపీ రాష్ట్ర కన్వినర్ శంకర్ రెడ్డి, కోమ్మా పరమేశ్వర రెడ్డి ‌రఘునాథ్ రెడ్డి, మున్నా లను పులివెందులలో విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలో కస్టడిలో ఉన్న సునీల్ యాదవ్, మాజీ డ్రైవర్ దస్తగిరి, భరత్ యాదవ్, ఉమాశంకర్ లను విచారిస్తున్నారు. వై ఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అనుమానం వ్యక్తం చేసిన వారిలో ఒక్కోక్కరిని సీబీఐ విచారిస్తున్నది.

Related posts

యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

Satyam NEWS

ఆరుగురు ప్రాణాలు మింగేసిన సెప్టిక్ ట్యాంక్

Satyam NEWS

కొనసాగుతున్న రాజధాని రైతు ఆందోళనలు

Satyam NEWS

Leave a Comment