25.2 C
Hyderabad
May 13, 2024 09: 41 AM
Slider పశ్చిమగోదావరి

పదేళ్లుగా బ్రిడ్జిని పట్టించుకోని అధికారులు

#bridgecollapse

ఏలూరుజిల్లా  లింగపాలెం మండలం ఆసన్నగూడెం, కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామాల మధ్య ఉన్న గుండెరు వాగుపై 100 సంవత్సరాల నాడు నిర్మించిన బ్రిడ్జి వాగు మధ్యభాగం లో వంతెన రెండుముక్కలు గా విరిగి కుంగిపోయింది. సుమారు 10 ఏళ్ల నాడే వంతెన శిథిలావస్థకు చేరిన అప్పట్లో అధికారులు ప్రమాద హెచ్చరికల బోర్డ్ లు మాత్రమే ఏర్పాటు చేసి ప్రయాణికుల ప్రాణాలు గాలికొదిలేశారు. 2022 లో కురిసిన భారీ వర్షాలకు వంతెన మరింత లోతుకు కుంగి వంతెన మధ్యభాగం లో విరిగి వంగిపోయింది. రెండు మండలాల మధ్య రాకపోకలు సుమారు 6 నెలల పాటు నిలిచిపోయాయి.

అయినప్పటికీ ప్రయాణికులు ప్రమాదమని తెలిసి కూడా విరిగిన వంతెన పైనే ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు, భారీ వాహనాల రాకపోకలకు ఏర్పడిన ఇబ్బందులు తెలుసుకున్న సంబంధిత రాజకీయ నాయకులు సంబంధిత అధికారులు స్పందించి వంతెన ప్రక్కన అప్రోచ్ రోడ్డు నిర్మించి వంతెన నిర్మాణాన్ని గాలికొదిలేసారని ప్రయాణికులు సంబంధిత అధికారులు తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడి వాగులు వంకలు పొంగి  వరదలు ఏరులై పారితే అప్రోచ్ రోడ్డుతోపాటు విరిగిన వంతెనకూడా వరదల ఉధృతి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఈ వేశవిలోనైనా వంతెన నిర్మించి కామవరపుకోట, లింగపాలెం మండలాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

నీలాచలం కొండ వద్ద స్పృహ తప్పిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

Satyam NEWS

ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Bhavani

శ్రీకాకుళంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కరోనా కలకలం..

Sub Editor

Leave a Comment