28.7 C
Hyderabad
April 28, 2024 09: 37 AM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కరోనా కలకలం..

corona_virus

శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పొందూరు మండలం తాడివలస గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థికి కరోనా వ్యాధి ప్రబలింది, ఈ సంఘటనపై ఒక్కసారిగా శ్రీకాకుళంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కరోనా కలకలం రేపింది, గడిచిన అక్టోబర్ నెల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 9, 10 తరగతులను రాష్ట్ర ప్రభుత్వం పాఠాలను, పాఠశాలలో తరగతులను, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది . అయితే ఈ 25 రోజులలో రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలో కరోనా వ్యాధి విద్యార్థినీ విద్యార్థులులోనూ, ఉపాధ్యాయుల్లో నూ తీవ్రంగా ప్రబలుతోంది.

829 మంది ఉపాధ్యాయుల‌కు.. 575 మంది విద్యార్థుల‌కు క‌రోనా..

దీనికి ఉదాహరణ ప్రభుత్వం ఇప్పటివరకు ఉపాధ్యాయులకు 70, 790 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 829 కరోనా వ్యాధి సోకింది, అదేవిధంగా 95, 763 విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 575 విద్యార్థులకు వ్యాధి సోకింది, ఇంకా మన రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్నం భోజనం పథ‌కం నిర్వాహకులకు ఈ వ్యాధి సోకింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల‌లోను, ప్రాణం భయం పట్టుకుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి నిరోధక టీకా రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు లక్షల మంది విద్యార్థులకు, లక్షల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.

మన పక్క రాష్ట్రాలైన ఒడిషా, కర్ణాటక, తమిళనాడు మరికొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు , ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరాన్ని జీరో సంవత్సరంగా గుర్తించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఈ రాష్ట్రాల్లో విద్యార్థులకు పూర్తిగా పాఠాలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మన రాష్ట్రంలో కూడా తక్షణమే పాఠశాలను మూసివేసి 1 తరగతి 10 తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ టీవీ చానల్ ద్వారా, రేడియోల ద్వారా, చరవాణి ద్వారా ఆన్ లైన్ పాఠాలను విద్యార్థులకు బోధించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మంత్రి ఆదిమూలపు సురేష్ కి, రాష్ట్ర విద్యా శాఖ అధికారులకు విద్యార్థుల ఆరోగ్యం వారి ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో ఈ విద్యా సంవత్సరం 2020 – 2021 0 విద్యా సంవత్సరం ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఈ సందర్భంగా కోరుతున్నారు.

Related posts

సెలబ్రేషన్స్: పతంగుల పండుగలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Satyam NEWS

అనుకున్న సమయానికి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందించాలి

Satyam NEWS

ఘనంగా అమృత లత అపురూప అవార్డుల ప్రదానోత్సవం

Satyam NEWS

Leave a Comment