35.2 C
Hyderabad
April 27, 2024 12: 58 PM
Slider ఖమ్మం

ప్రజా ఉద్యమాలను విస్తృత పర్చండి

#CPI district

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను విస్తృత పర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పిలుపునిచ్చారు. పాలక వర్గాలు అధికార దాహంలో సామాన్యులను విస్మరించాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం నగర సిపిఐ కౌన్సిల్ సభ్యులు, కార్పోరేషన్ కార్యదర్శుల సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది.

మహ్మద్ సలాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోటు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు, సీట్లు, సంపాదనే కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వారికి ప్రధాన ఎజెండాగా మారిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలను సమీకరించి కార్యక్రమాలను విస్తృత

పర్చాలన్నారు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఖమ్మంలో జరిగే జన సేవాదళ్ జాతీయ శిక్షణా శిబిరాన్ని జయప్రదం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. 22 రాష్ట్రాల నుంచి జన సేవాదళ్ శిక్షణా శిబిరానికి యువకులు హాజరు కానున్నారని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి ఎస్కె జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, నాయకులు సాంబశివారెడ్డి, తాటి నిర్మల, నానబాల రామకృష్ణ, శాఖమూరి శ్రీనివాసరావు, నూనె శశిధర్, సైదా, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రూ.410 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణం

Satyam NEWS

కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రవీణ్ ప్రకాష్ కు అనుమతి నిరాకరణ

Satyam NEWS

సెంచరీ కొట్టిన టమోటా: రికార్డు స్థాయి ధర

Satyam NEWS

Leave a Comment