Slider గుంటూరు

తోటను ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పించండి

#balakotaiah

1996 డిసెంబర్ 29వ తేదీన రామచంద్రపురం మండలంలోని వెంకటాయపాలెంలో జరిగిన ఇద్దరు దళితుల శిరోముండనం కేసులో వైకాపా నాయకులు తోట త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ కోర్టు శిక్ష విధించటాన్ని స్వాగతిస్తున్నామని, నిందితుడు ఎన్ని కుట్రలు చేసినా, అంతిమంగా దళితుల ఆత్మగౌరవమే గెలిచిందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

ఈ కేసులో నుంచి బయట పడేందుకు నిందితులు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశారని, ఎస్సీలను క్రిష్టియన్ బిసిలుగా  చూపించే ప్రయత్నాలు అధికారికంగానే జరిగాయన్నారు. బాధితులను భయపెట్టారని, ప్రలోభ పెట్టారని తెలిపారు. ఐనా న్యాయమే అంతిమంగా విజయం సాధించిదని అన్నారు. గతంలో శిరోముండనం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తోటకు ఎమ్మెల్సీ ఇవ్వొదని చెప్పినా, ముఖ్యమంత్రి ఉలుకు, పలుకు లేకుండా మౌనంగా ఉన్నారని, కోర్టు తీర్పు నేపథ్యంలో మండపేట వైకాపా ఎమ్మెల్యే టికెట్  తోటకు రద్ధు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని  కోరారు.  లేకపోతే తోట త్రిమూర్తులతో పాటు వైసిపికి వ్యతిరేకంగా రాష్ట్రంలో దళితులు ఎవ్వరూ వైకాపాకు ఓట్లు వేయరని బాలకోటయ్య హెచ్చరించారు

Related posts

శ్రమజీవుల హక్కులను హరిస్తున్న కేంద్రం

Satyam NEWS

గోవాలో ‘క్రాక్’ మూవీ లాస్ట్ షెడ్యూల్‌

Sub Editor

న్యూ మ్యాంగ్ కుంఫు విద్యార్థులకు రాష్ట్ర మంత్రి ప్రశం

Satyam NEWS

Leave a Comment