29.7 C
Hyderabad
May 6, 2024 07: 02 AM
Slider హైదరాబాద్

ఉప్పల్లో బి ఆర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

#brs

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి పాటుపడతానని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్య అతిథులుగా  బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య హాజరైనారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి రాబోయే ఎన్నికలు గూర్చి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంకు వంద పడకల ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ రెండు రోజుల క్రితమే జీవో విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలుసని, మరో జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ,  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతి పత్రం  అందజేశానని తెలిపారు. నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించక మునుపే బి ఎల్ ఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవలో ఉన్నానని, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఉప్పల్ నియోజకవర్గం కోసం ఇప్పటికే రెసిడెన్షియల్ జోన్ గా ఒకటి,  100 పడకల ఆసుపత్రి అని ఇలా రెండు జీవోల విడుదలకు కృషి చేశానని ,  ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉప్పల్ నియోజకవర్గం లో ప్రజలు చూస్తారని హామీ ఇచ్చారు.

ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. బి ఎల్ ఆర్  ట్రస్టు ద్వారా నియోజకవర్గంలోనీ ఎన్నో పేద కుటుంబాలకు తన వంతు సహాయంగా ఆరోగ్యానికి, ఉన్నత చదువులకు, ఆడపిల్లల పెళ్లిళ్లకు, విదేశాల చదువులకు ఇలా ఎవరికి ఏ అవసరం ఉన్నా  బి ఎల్ ఆర్ ట్రస్టు ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో దలితులకు దలితబంధు, ముస్లీం సోదరులకు మైనారిటీ బంధు, బీసిలకు బీసీ బంధు, నిరుపేదలకు గృహలక్ష్మి ఇలా చెప్పుకుంటూపోతే అనేకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయనీ ప్రతి పథకం లబ్ధిదారులకు చేరవేసే విధంగా కృషి చేస్తానని అన్నారు.

ఆయుష్మాన్ భారత్ , ఆరోగ్యశ్రీ పథకాలను నియోజకవర్గ పేద కుటుంబాలకు అందాలనే సంకల్పంతో ఇన్సూరెన్స్ కూడా తన సిబ్బందితో ప్రతి కాలనీలో సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి పాటుపడతానని తెలియజేశారు.

ఈ సందర్భంగా సభకు హాజరైన ముఖ్య నాయకులు మాట్లాడుతూ   ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు  అందుతున్నాయన్నారు. ఎన్నికల సమయం దగ్గర పదుతున్న నేపథ్యంలో కార్యకర్తలందరూ ఏకమై పని చేయాలని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని పార్టీ శ్రేణులు అత్యధిక మెజారిటీతో గెలిపించాడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో  డివిజన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బండారి లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, దానికి తగిన విధంగా కృషి చేస్తామని పార్టీ శ్రేణులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

కొత్తగా 1000 మత్స్య సహాకార సహకార సంఘాలు

Murali Krishna

అమరావతిపై కేంద్రం అఫిడవిట్ తో ఆందోళన వద్దు

Satyam NEWS

ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన

Sub Editor 2

Leave a Comment