39.2 C
Hyderabad
May 3, 2024 12: 31 PM
Slider ముఖ్యంశాలు

అమరావతిపై కేంద్రం అఫిడవిట్ తో ఆందోళన వద్దు

#Raghuramakrishnam Raju MP

రాష్ట్రాల రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని కేంద్రం రాష్ట్ర హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు.

అమరావతికి తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెడ్డొచ్చి మొదలు అన్నట్లు ఏపీ ప్రభుత్వ తీరు ఉందని ఎద్దేవా చేశారు. కదిలించడానికి వీల్లేని హైకోర్టును కర్నూలులో పెడతామంటున్నారని, దీనికి అభివృద్ధి వికేంద్రీకరణ అని పేరు పెట్టారని, అభివృద్ధి కేంద్రీకరణ అని చెబితే బాగుంటుందని రఘురామకృష్ణంరాజు అన్నారు.

విశాఖపట్టణం ఇప్పటికే అభివృద్ధి చెందిందని అక్కడ లేనిదంటూ ఏమీ లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. శ్రీకాకుళంలో చాలా పరిశ్రమలు ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలను చెడగొట్టవద్దని ఆయన జగన్ ప్రభుత్వానికి సూచించారు.

ఎంతో అభివృద్ధి చెందిన విశాఖను అభివృద్ధి చేస్తామనడం కామెడీగా ఉందన్నారు. విశాఖ ప్రశాంత వాతావరణాన్ని పాడుచేయొద్దన్నారు. సీఎం జగన్‌కు రాయలసీమపై నిజమైన ప్రేమ ఉంటే అమరావతిలోనే రాజధానిని ఉంచి సీమలో న్యాయ రాజధాని పెట్టాలని రఘురామకృష్ణరాజు సూచించారు.

Related posts

బాబు మాటలు అసత్యాల మూటలు

Satyam NEWS

హుజూర్ నగర్ కోవిడ్  సెంటర్ ను సందర్శించిన  DM & HO

Satyam NEWS

ముజ్గి మల్లన్నకు మంత్రి ఇంద్రకరణ్ స్వాగతం

Satyam NEWS

Leave a Comment