29.7 C
Hyderabad
May 1, 2024 09: 14 AM
Slider కర్నూలు

ప్రజల పన్నుల సొమ్ముతో చర్చిల నిర్మాణమా ?

ప్రజాధనాన్ని చర్చిల నిర్మాణానికి కేటాయించడంపై న్యాయపోరాటం చేస్తామని ఏపీ బీజేపీ ప్రకటించింది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడటం దారుణమని అనంతపురంలో విడుదల చేసిన ఓక ప్రకటనలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చిల నిర్మాణం, మరమ్మతుల కోసం నియోజకవర్గానికి రూ. కోటి విడుదల చేయడం రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రజల కట్టిన పన్నులడబ్బుతో ఓటు బ్యాంకు రాజకీయాలు, మత రాజకీయాలా సిగ్గుచేటని ఏపీ బీజేపీ మండి పడింది. ప్రజల అభివృద్ధిని వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసి అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా డబ్బుల పంపిణీతో పాలన సాగిస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇమామ్ లకు, మౌజంలకు, పాస్టర్లకు నెల నెలా క్రమం తప్పకుండా జీతాలు ఇస్తూ, వారి జీతాలను పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న మాట వాస్తవమన్నారు.

ఇలా నెలవారీగా ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులను మత వ్యవహారాలకు వినియోగిస్తూ.. ఇప్పుడు కొత్తగా చర్చిల నిర్మాణాలకు, వాటి రిపేర్లకు నియోజకవర్గానికి కోటి చొప్పున కేటాయించడం అంటే వైసీపీ ప్రభుత్వం ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను పతాకస్థాయికి చేర్చడమేనన్నారు. ఒకవైపు బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వాటిని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు కట్టిన పన్నులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు.

Related posts

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటా

Satyam NEWS

తెలంగాణ బిజెపి నేతలను అభినందించిన జేపి నడ్డా

Satyam NEWS

రాజ్యాంగాన్ని అవమానించే వారిని తరిమికొట్టండి

Satyam NEWS

Leave a Comment