35.2 C
Hyderabad
April 27, 2024 11: 54 AM
Slider ప్రత్యేకం

రాజ్యాంగాన్ని అవమానించే వారిని తరిమికొట్టండి

#BRAmbedkar

ఓటు గురించి కేవలం ఎన్నికల సమయంలోనే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మర్చిపోతారు. ఇదే మన దేశంలో ప్రధాన సమస్య. కుల,మత, ప్రాంత, వర్గ తేడా లేకుండా భారత రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించింది.

ఓటు హక్కు గురించి ఎంత అవగాహన పెరిగితే మన దేశంలో అంత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మందు, డబ్బులు, ఇతర వస్తువులను తీసుకొని ఓటు హక్కును అమ్ముకుంటున్నాం. ఇలా కొనుక్కున్న ఓట్లతో అనర్హులు అందలం ఎక్కుతున్నారు. నా చేతిలో వెయ్యి ఓట్లు ఉన్నాయి అని బేరం పెట్టేవాడిని కూడా చూస్తాం.

ఇలా వాడు మాట్లాడుతున్నాడంటేనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అన్నమాట. ఒకడి చేతిలో ఓట్లు ఉండటం ఏమిటి? వాడికి డబ్బులు ఇచ్చి వీడు ఓట్లు కొనుక్కోవడం ఏమిటి? ఓట్ల కోసం డబ్బును పంచే వాడు, అమ్ముడు పోయేవాడు ఇద్దరూ నేరస్తులే.

ఇలా నేరం చేసి గెలిచిన వాడు తన ఓటును అమ్ముకుంటున్నాడు. పార్టీలు మారుతున్నాడు, పదవులు అనుభవిస్తున్నాడు. చట్టాలు చేస్తున్నాడు. పదవులను తాకట్టు పెట్టడం అలవాటు చేసుకుంటున్నాడు. అందుకే కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా అన్ని వేళల్లో ఓటు పై అవగాహన పెంచుతూ ఉండాలి.

దేశ, రాష్ట్ర, ప్రాంతం నిర్మాణం కోసం పాటు పడే సరైన నాయకుని  ఎన్నుకోవడం మన అవసరం. ఓటు కొనుక్కునే దరిద్రులను పదవుల నుంచి దించడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. నా దేశాన్ని ముందుకు నడిపించే రాజ్యాంగం నాకు అతిపవిత్రమైనదనే భావన అందిరిలోనూ ఏర్పడాలి.

రాజ్యాంగబద్ధంగా  ఏర్పడిన  ప్రజాస్వామ్యం గల మన దేశంలో తనకు కల్పించిన హక్కులతోనే  ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. జీవనం కొనసాగిస్తున్నాడు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రంగా చూడాలి. రాజ్యాంగ స్ఫూర్తిని అందరూ అర్ధం చేసుకుని పాటించాలి.

అప్పుడే నవసమాజం వికసిస్తుంది. కుల మత ప్రాతిపదికన కాకుండా అందరికి సమానంగా విద్య, వైద్యం, ప్రభుత్వ ఫలాలు అందాలని బాబా సాహెబ్ చెప్పాడు. మరి ఇప్పుడు అలా జరుగుతున్నదా అని ప్రశ్న వేసుకుంటే దానికి లేదనే సమాధానం వస్తున్నది.

మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా బతుకుతున్నామో అర్ధం చేసుకోవాలి. కులం, మత పిచ్చితో కొట్టుకుంటున్నవారు ప్రజలను ఓట్లు గానే చూస్తున్నారు తప్ప ప్రాణం ఉన్న మనుషులుగా చూడటం లేదు. భారత  రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసిన పోరాటాలు ఉన్నాయి.

ప్రాణాలు అర్పించిన సంఘటనలు ఉన్నాయి. రాజ్యాంగం అంటే ఎంతో పవిత్రమైనది. దేశాన్ని ముందుకు నడిపించే అతి పవిత్రమైన రాజ్యాంగాన్ని అవమానిస్తూ, ఓట్లను అమ్ముకోవడం, కొనుక్కోవడం రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్లే అలాంటి వారిని సహించవద్దు, భరించవద్దు. రాజ్యాంగ బద్ధంగా చేసిన ప్రమాణాలను మరచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మూర్ఖులను ఎవరూ ఉపేక్షించవద్దు.

ఏ ఎన్నిక అయినా సరే భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కులను అత్యంత పవిత్రంగా వినియోగించుకోవాలి. అదే విధంగా పరిచయం ఉన్న వ్యక్తులందరికి కూడా ఇదే విషయం అర్ధమయ్యేలా చెప్పాలి.

అవుట రాజశేఖర్, రిపోర్టర్, కొల్లాపూర్

Related posts

వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ వివిధ పార్టీల బీసీల ధర్నా

Bhavani

ప్రజలకు చేరువ అవుతున్న సంచార వైద్య సేవ

Satyam NEWS

శాల్యూట్: కరోనా యోధులపై కురిసింది పూలవాన

Satyam NEWS

Leave a Comment