26.7 C
Hyderabad
May 3, 2024 11: 00 AM
Slider రంగారెడ్డి

సి బి ఐ టి కళాశాల లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్లబ్ ప్రారంభం

#cbit

ప్రపంచ ప్రమాణాల దినోత్సవాలు సందర్భంగా ఈ రోజు సి బి ఐ టి కళాశాల లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్లబ్ ను ప్రారంభించారు. ఈ రోజున, బిఐఎస్  ప్రతినిధులు  వివిధ ప్రమాణాలు, ప్రమాణాల అభివృద్ధి, అవకాశాలు మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాలపై ఓరియంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ పోటీలు కూడా నిర్వహించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో పని చేసిన విశాంత శాస్త్రవేత్త  ఎ ఎన్ ఎస్ పి  శాస్త్రి, జాయింట్ డైరెక్టర్ సైంటిస్ట్-డి దిలీప్ చత్తర్,  హైదరాబాద్ శాఖ  స్టాండర్డ్స్ ప్రమోషన్ ఆఫీసర్ అభిసాయి ఎట్టా, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు, ఈ కార్యక్రమ నిర్వహణకర్తలు డాక్టర్ టి  సుధాకర్ బాబు, ఎన్ సంతోష్  కుమార్ ఇతర అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.

ఈ క్లబ్‌ల లక్ష్యం భారతీయ ప్రమాణాల సూత్రీకరణ, అనుగుణ్యత అంచనా, ప్రయోగశాల పరీక్ష, హాల్‌మార్కింగ్ పథకం, వినియోగదారుల వ్యవహారాల కార్యకలాపాలు, ప్రచార కార్యకలాపాలు మరియు శిక్షణ సేవలు మొదలైన వాటి గురించి విద్యార్థులలో అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఈ కార్యక్రమం క్రింద  పోటీలు, క్విజ్‌లు, వ్యాస రచన మరియు ప్రమాణం మరియు నాణ్యతపై చర్చలు వంటి వివిధ కార్యకలాపాలు నిర్వహించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 5వ సెమిస్టర్  విద్యార్థులు మహావీన్, హేమంత్ వర్మ, శ్రేయ టి  10 వేల రూపాయలు నగదు బహుమతి  గెలుచుకున్నారు.

Related posts

రెండు రాష్ట్రాల పెండింగ్ సమస్యల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు

Satyam NEWS

తనపై వేసిన పిటిషన్ కొట్టివేయాలని కోర్టుకు కొప్పుల

Bhavani

టీచర్స్ డే సందర్భంగా “గురువు”లకు గిప్ట్..!

Satyam NEWS

Leave a Comment