29.7 C
Hyderabad
May 1, 2024 06: 47 AM
Slider హైదరాబాద్

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

#mlakaleru

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గోల్నాకలోని ఏకే ప్లాజా నందు ప్రారంభించి, కార్పొరేటర్లతో కలిసి అంబర్ పేట నియోజకవర్గంలోని మహిళలకు బతుకమ్మ చీరలను అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముందస్తుగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ బతుకమ్మ పండుగ నాడు కొత్త చీరలు ధరించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 నుండి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారని, ఇది ఆడపడుచులకు సర్కార్ ఇచ్చే సారె అని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పద్మావెంకట్ రెడ్డి, దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్, ఉమారమేష్ యాదవ్, హేమలత, డీఎంసీ మారుతి, యూసీడీ ఆఫీసర్ రజిత, డైరెక్టర్  సౌజన్య, అధికారులు, నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

సోమశిల మునక ప్రాంతంలో రగడ: అధికారుల అడ్డగింత

Satyam NEWS

మెడికల్ నెగ్లిజెన్స్: సిఎం ఇలాకాలో గర్భిణి మృతి

Satyam NEWS

ఐ ఎన్ టి యు సి మండల మహిళా అధ్యక్షురాలిగా ఎడవెల్లి ధనలక్ష్మి

Bhavani

Leave a Comment