31.2 C
Hyderabad
May 12, 2024 00: 55 AM
Slider విజయనగరం

టీచర్స్ డే సందర్భంగా “గురువు”లకు గిప్ట్..!

#teachers

విజయనగరం జిల్లాలో 71 మంది టీచర్లకు సన్మానం

విద్యార్థుల్లో వ్యక్తిత్వాన్ని వికసించేలా చేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విజయనగరం  జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆమె స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గురుపూజోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు ఎక్కువ సమయం బడిలోనే గడుపుతారని, వారిలో ప్రతిభ, నైపుణ్యం గుర్తించే అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో దాగివున్న నైపుణ్యాన్ని గుర్తించి పదును పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు.

ఉపాధ్యాయులు సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి,  ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు, టీచర్స్ డే సందర్భంగా ప్రభుత్వం ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు.  సన్మాన గ్రహీతలను కలెక్టర్ అభినందించారు. వారి కృషి, అంకిత భావాన్ని ప్రశంసించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. గత నాలుగేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు.

పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో, ప్రభుత్వం అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవెన లాంటి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నాడు-నేడు కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు ఆంగ్లభాషలో బోధన, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ, బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటర్ వరకు హెచ్చించడం తదితర కార్యక్రమాలు విద్యార్థుల ప్రగతి కోసం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థుల జీవితాలను సమున్నతంగా తీర్చిదిద్దెందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.అనంతరం విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కంటి మహనీయులు ఉదాహరణ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో    విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. అందుబాటులో ఉన్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జిల్లాలోని 71 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి, ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఆంగ్లభాష ప్రావీణ్యం ఉన్న నలుగురు ఉపాధ్యాయులను కూడా ఈ ఏడాది తొలిసారిగా సత్కరించారు.

ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతమూ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి రావు, జెడ్పీ సీఈవో కె .రాజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వర రెడ్డి, డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.టి. నాయుడు, ఉప విద్యాశాఖ అధికారులు బ్రహ్మాజీ, వాసుదేవరావు, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఆరుగురు ఆడ‌పిల్ల‌లు…అంగవైకల్యంతో ఉన్న తండ్రి…..

Satyam NEWS

గుజరాత్ లో ఒక్క అవకాశం ఇవ్వండి: కేజ్రీవాల్

Satyam NEWS

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment