38.2 C
Hyderabad
May 2, 2024 21: 43 PM
Slider నల్గొండ

అభివృద్ధి పథంలో హుజుర్ నగర్ నియోజకవర్గం

#MLAHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం  కల్మలచెర్వు  గ్రామంలో  బతుకమ్మ చీరల  పంపిణీ  కార్యక్రమాన్ని హుజుర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ ‘బతుకమ్మ’ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరలు కానుకగా అందించడంతో పాటు నేతన్నలకు ఉపాధి అందించాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ ప్రభుత్వం చేపడుతున్నదని అన్నారు. 

రైతును రాజును చేయడమే కే‌సి‌ఆర్ లక్ష్యమని,ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా రైతుబంధు పథకం ఆగదని, ముదిరాజ్ లకు చేపపిల్లల పంపిణీ, యాదవులకు గొర్రెలపంపిణీ కార్యక్రమాలకు చేపడుతున్నామని అన్నారు.

SC సోదరులకు, రైతు కూలీల సంక్షేమానికి టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ప్రతి నెలా నియోజకవర్గంలో 50 నుడి 60 లక్షల రూపాయల ప్రభుత్వ పథకాలను చేపడుతున్నామని, సంవత్సర కాలంలో RDO కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల, ITI కళాశాల, ట్రైబల్ గురుకుల పాఠశాల ఇంకా కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు నియోజకవర్గానికి మంజూరైనాయని అన్నారు.

యువత కోసం Industrial Park ఏర్పాటుకు త్వరలో ఆదేశాలు వస్తాయని, దీని వలన సుమారు కొన్ని వందల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందని, NAC ద్వారా మహిళలు , నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.

అనంతరం మండలంలోని 27 మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ₹ 27,03,132 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ మార్కెట్ చైర్మన్ కడెం వెంకటరెడ్డి, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద రెడ్డి,  ప్రధాన కార్యదర్శి మన్సూర్ అలీ, తహసిల్దార్, MPDO, MPO తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసుల అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినంద‌న‌

Sub Editor

ఆర్కే బీచ్‌లో స్నానానికి దిగి ఐదుగురి గల్లంతు

Satyam NEWS

మేడే: కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment