31.2 C
Hyderabad
February 11, 2025 21: 18 PM
Slider తెలంగాణ

క్లియర్ కట్ :శరణార్థులను ఆదుకోవడానికే సీఏఏ కిషన్‌రెడ్డి

kishanreddy

శరణార్థులను ఆదుకునేందుకే సీఏఏను తీసుకొచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ చట్టం ఏ మతం, కులానికి, వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఎవరినీ దేశం నుంచి పంపించేదిలేదని దేశప్రతినిధిగా చెబుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీల నేతలు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. శరణార్థులను ఆదుకునేందుకే సీఏఏ చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి హామీలు ప్రగతిభవన్​ దాటట్లేదని ఎద్దేవా చేశారు.

కొన్ని రాష్ట్రాలు ఎన్‌పీఆర్ అమలు చేయబోమని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఎన్‌పీఆర్ ఎందుకని రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తున్నారు..అనుమతి లేకుండా ఎవరినైనా మీ ఇంట్లోకి అనుమతి ఇస్తారా అంటూ రాహుల్​ను ప్రశ్నించారు. సీఏఏలో ఒక్క అక్షరం తప్పున్నా మార్చడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. జమ్ముకశ్మీర్ ప్రజల హృదయాలను గెలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. జేఎన్‌యూ ఘటనపై స్పందించిన కిషన్​రెడ్డి ఆ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వంపై స్పందిస్తూ.. కుటుంబ రాజకీయాల పెత్తనం దేశం మీద ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ హామీలు ప్రగతిభవన్ గోడలు కూడా దాటడం లేదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బయపడకుండా భాజపాకు ఓటు వేయాలని సూచించారు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేస్తామన్న ప్రతిపాదన కూడా ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

ఏపీ మూడు రాజధానుల అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆ అంశం రాష్ట్ర పరిధిలోనిదని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఏపీ రాజధానుల అంశం కేంద్రం దృష్టికి రాలేదన్నారు.

Related posts

2022 ఏడాది చివరికల్లా గగన్ యాన్..

Satyam NEWS

యువ తెలంగాణ పార్టీ కార్యాలయం ప్రారంభం

Sub Editor

సర్వేలకు అందని రీతిలో తీర్పు

mamatha

Leave a Comment