కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్ను శ్లాబ్ లలో మార్పులు చేశారు. మధ్య, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర బడ్జెట్ లోఆదాయపన్ను శ్లాబ్‌లను 3 నుంచి 6 శ్లాబ్‌లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వివరాలు:
0 నుంచి 2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు
2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఆదాయపన్ను
5 లక్షల నుంచి 7.50 లక్షల వరకు 10 శాతం ఆదాయపన్ను
7.50 లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం ఆదాయపన్ను
10 లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20 శాతం ఆదాయపన్ను
12.50 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం ఆదాయపన్ను
15 లక్షలకు పైనా ఆదాయం ఉన్నవారికి 30 శాతం ఆదాయపన్ను