38.2 C
Hyderabad
May 2, 2024 22: 20 PM
Slider ప్రపంచం

నీరు లేక పది వేల ఒంటెలను చంపనున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం

camels killing australia water

కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న ఆస్ట్రేలియా లోని పలు ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో వేల జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. దానితో పాటు తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలను ప్రారంభించింది.

కరువు నెలకొన్న ప్రాంతాల్లో ఒంటెల సంఖ్య అధికంగా ఉంది. ఇవి అధికంగా నీరు తాగుతున్నాయి, దీని కారణంగా కరువు నెలకొన్న ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత నెలకొంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒంటెలను చంపాలని నిర్ణయించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఒంటెలు ఏడాదికి ఒక టన్ను కార్బన్‌డైయాక్సైడ్‌తో సమానమైన మీథేన్‌ను విడుదల చేయటం మరో కారణంగా పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ మొత్తాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయనున్నారు.ఇందులో భాగంగా 10వేల ఒంటెలను చంపనున్నట్లు సమాచారం. అనంగు పిజంజజరా యకుంనిజజరా ప్రాంతంలోని ఆదిమ తెగ నాయకుల ఆదేశాల అనంతరం వీటిని నిపుణులైన సాయుధులు హెలికాఫ్టర్ల ద్వారా కాల్చి చంపనున్నారు. దీని కోసం ముందుగా చంపాలనుకున్న ఒంటెలను కల్లింగ్‌ అనే పద్ధతి ద్వారా నిర్ణయించుకుంటారు. తర్వాత వాటి కళేబరాలను ఆస్ట్రేలియా ప్రభుత్వ తగులబెట్టనుంది.

‘‘ఒంటెలు, మా ఇంటి ఆవరణలోని కంచెలను దాటుకుని లోపలికి వస్తున్నాయి. ఇంటి చుట్టూ తిరుగుతూ, ఎయిర్‌ కండీషనర్ల నుంచి నీరు తాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర వేడి కారణంగా మేము అసౌకర్యానికి గురయి, అనారోగ్యం బారిన పడుతున్నాము’’ అని మారిటా బేకర్‌ అనే స్థానిక మహిళ తెలిపారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కార్చిచ్చు కారణంగా ఎన్నో వేల జంతువులు మృతిచెందాయని, ఇప్పడు వీటి చంపడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు.

Related posts

హ్యాపీ పొంగల్: కొత్త దిశలో దినకరుడి దివ్యయాత్ర

Satyam NEWS

రామంతపూర్ డివిజన్ లో జ్వరం సర్వేలో పాల్గొన్న కార్పొరేటర్

Satyam NEWS

కేసీఆర్ పై కోపంగా ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Satyam NEWS

Leave a Comment