29.7 C
Hyderabad
May 3, 2024 05: 51 AM
Slider వరంగల్

మతి స్థిమితం లేని ఈ మహిళను గుర్తుపట్టగలరా?

#warangal police

మతి స్థిమితం లేని ఈ వృద్ధ మహిళ తప్పిపోయింది. ఎక్కడ తన వారు ఉన్నారో చెప్పలేకపోతున్నది. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ లోని స్వధార్ హోం లో ఆశ్రయం పొందుతున్నది.

ఆమె వద్ద లభించిన ఆధారాల ప్రకారం ఆమె ఒక తెలుగు మహిళ అని స్వధార్ హోం వారు గుర్తించారు. అంతే కాకుండా వరంగల్ కు చెందిన మహిళగా భావిస్తున్నారు.

అయితే ఆమెకు సంబంధించిన వారు ఎవరూ స్వధార్ హోం వారికి ఆచూకీ దొరకలేదు. ఆమె కూడా మతి స్థిమితం లేని కారణంగా చెప్పలేకపోతున్నది.

స్వధార్ హోం వారు ఈ విషయాలను వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఫొటోలో ఉన్న మహిళను ఎవరైనా గుర్తిస్తే వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Related posts

ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలి

Bhavani

పాకిస్తాన్‌కు దుబాయ్ షాక్ .. కాశ్మీర్‌‌లో భారీ పెట్టుబడులు

Sub Editor

వరంగల్ కమీషనర్ గా రంగనాథ్

Murali Krishna

Leave a Comment