27.7 C
Hyderabad
April 26, 2024 06: 45 AM
Slider ముఖ్యంశాలు

నేషనల్ బాక్సింగ్ పోటీలకు కాగజ్నగర్ అమ్మాయి లక్ష్మీప్రియ

#kagaznagar girl

హర్యానా రాష్ట్రంలో ఈ నెల 26 నుండి 30 వరకు నిర్వహించనున్న 3 జూనియర్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ పోటీలకు గాను తెలంగాణ రాష్ట్రం బాక్సింగ్ టీం సెలక్సన్స్ ను సికింద్రాబాద్ లోని ఆర్.ఆర్.సి గ్రౌండ్ లో ఈ నెల 19, 20న నిర్వహించారు.

ఈ బాక్సింగ్ సెలెక్షన్స్ లో అన్ని జిల్లాల నుండి టీం లు సెలెక్సన్స్ కోసం రావడం జరిగింది. ఈ సెలెక్సన్స్ లో మన ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి అండర్ 17 (52-54 కిలోల క్యాటగిరి)లో  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  కాగజ్నగర్ పట్టణం ఏఫ్ కాలనీకి చెందిన పైడిపల్లి లక్ష్మీప్రియ సెలెక్ట్ కావడం విశేషం.   

కాగజ్ నగర్ ఎఫ్ కాలనీకి చెందిన పైడిపల్లి రమేష్ (వికలాంగుడు), స్వరూప దంపతులకు ఇద్దరు అమ్మాయిలు కాగా లక్ష్మీ ప్రియ రెండవ అమ్మాయి. పదవ తరగతి పూర్తి చేసుకుని ప్రస్తుతం ఇంటర్ ప్రధమ సంవత్సరానికి ధరఖాస్తు చేసుకుంది. చిన్నప్పటి నుండి బాక్సింగ్‌ అంటే ఎంతో మక్కువ కనబర్చే లక్ష్మీప్రియకు శేఖర్ మాస్టర్ గత ఐదు సంవత్సరాలుగా కోచింగ్ ఇస్తున్నాడు. 

సికెంద్రాబాద్ లో జరిగిన బాక్సింగ్ సెలెక్షన్స్ లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి నేషనల్ కు సెలెక్ట్ అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి నేషనల్ బాక్సింగ్ పోటీలకు కేవలం లక్ష్మీప్రియ ఒక్కరే సెలక్ట్ కావడం మన కాగజ్నగర్ కే గర్వ కారణమని  ఆదిలాబాద్ జిల్లా బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు నివాస్, ప్రధాన కార్యదర్శి శేఖర్, రమాకాంత్ యాదవ్ ట్రెశరర్, జనరల్ సెక్రెటరి జయేందర్, దేవేందర్ ,రవి, మధు తెలిపారు

Related posts

మీ రంగును రఘురాముడు ఫేడౌట్ చేస్తున్నారు చూసుకోండి

Satyam NEWS

తిరోగమన దిశగా బిజెపి

Bhavani

డొమినికన్ రిపబ్లిక్‌లో కూలిన విమానం

Sub Editor

Leave a Comment