కరోనా వైరస్ 20 దేశాలకు విస్తరించింది. మరిన్ని దేశాల్లో పాజిటివ్ కేసులు ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. శ్వాసకోస వ్యాధులు వస్తున్న నేపథ్యంలో చైనాలో ఎవరూ ఉండకూడదని బ్రిటన్ తమ దేశ టూరిస్టులకు ఆదేశాలిచ్చింది. చైనాలో వైరస్ సోకిన వారి సంఖ్య సుమారు 24 వేలకు చేరుకున్నది. ఒక్క హుబేయ్ ప్రావిన్సులోనే 65 మంది ప్రాణాలు కోల్పోయారు.
వైరస్ వ్యాప్తి ఎక్కువగా వున్న హుబేయ్ రాజధాని వుహాన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. హుబేయ్ ప్రావిన్సులో సుమారు 5 కోట్ల మందిని క్వారెంటైన్ చేసినట్లు సమాచారం. మొత్తం సిటీని లాక్‌డౌన్ చేశారు. బయటకు వెళ్లేవారు కానీ, లోపలికి వచ్చేవాళ్లు కానీ ఎవరూ లేరు. చైనా చేస్తున్న నియంత్రణ ఏర్పాట్లు వల్ల కరోనా వ్యాప్తి అదుపులో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.