40.2 C
Hyderabad
April 29, 2024 15: 54 PM
Slider వరంగల్

వెల్ కమ్: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్ధులు చేరాలి

govt college

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్ధులు పెద్దఎత్తున చేరాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి బైరి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్ధులకు అన్ని సౌకర్యాలతో పాటుగా అనుభవజ్ఞులైన ఉన్నత విద్యార్హతలు కలిగిన అధ్యాపకులు ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల (కోఎడ్యుకేషన్) ధర్మకంచ జనగామ లో DIEO బైరి శ్రీనివాస్, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ జ్యోత్న్నారాణి, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో కళాశాలలోని సౌకర్యాలు తెలియజేసే 2020 క్యాలెండర్ ఆవిష్కరించారు.

ఈ ఏడాది మార్చిలో SSC పరీక్షలు రాయబోయే విద్యార్థుల సౌకర్యార్థం SSC వార్షిక పరీక్షల టైం టేబుల్ తో కూడిన పాకెట్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బైరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్) ధర్మకంచ లో ఇంటర్ ప్రధమ సంవత్సరంలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉచిత విద్యతో పాటుగా ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలను అందిస్తున్నామన్నారు. SC, ST, BC, MHRD & మైనారిటీ విద్యార్థులకు స్కాలర్ షిప్ సౌకర్యాలు, విద్యార్థులకు స్వచ్ఛమైన మినరల్ వాటర్ సౌకర్యాలను కళాశాలలో అందిస్తున్నామన్నారు.

కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ జ్యోత్స్నరాణి విద్యార్ధులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామన్నారు. ధర్మకంచ జూనియర్ కళాశాలలో చేరిన ప్రతీ గ్రూప్ టాపర్ కి రూ వెయ్యి నగదు ప్రోత్సాహక బహుమతిని అందిస్తున్నామన్నారు. వార్షిక పరీక్షల్లో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో కళాశాల టాపర్లుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు ఎండి పథకాలను బహూకరిస్తున్నామన్నారు.

తమ కళాశాలలో చేరిన విద్యార్థులు వివిధ క్రీడలలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాణించి బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ తమ పిల్లల్ని పెద్ద ఎత్తున ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్) ధర్మ కంచలో చేర్పించాలని జ్యోత్న్నారాణి కోరారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యాసాగర్ రెడ్డి, పూజారి వెంకటేశ్వర్లు, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, ఎం.డి. అఫ్టల్, అబ్దుల్ ఖలీల్, కూతాటి బాల రాజు, కనక శ్రీ విజయ రఘునందన్, రంగన్న, రవీందర్ రెడ్డి, ఇస్రల్ భాను, ముక్తధీర్, ఇంతియాజ్, విక్రం రెడ్డి, శ్రీనివాస్, తిరుమలేష్, రేఖ, వరూధిని, శహనాజ్ తరున్నం, నాజన్ సుల్తానా పలువురు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఆర్టీసీ విలీనం ప్రతిపాదన వదులుకున్న యూనియన్

Satyam NEWS

Another calamity: మిడతల దాడి బెడద దేశాన్ని వదల్లేదు

Satyam NEWS

గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్ ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment