29.7 C
Hyderabad
May 3, 2024 05: 22 AM
Slider సంపాదకీయం

రాంగ్: మూడు రాజధానుల కాన్సెప్టులో తప్పటడుగు

jagan 05

మూడు రాజధానుల కాన్సెప్టుతో మొండిగా ముందుకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకస్మాత్తుగా జీవో నెం 13ను జారీ చేసింది. న్యాయ రాజధాని గా చేయబోతున్న కర్నూలుకు సంబంధిత కార్యాలయాలను తరలిస్తున్నామని పెద్ద ఎత్తు ప్రచారం కూడా చేశారు. మూడు రాజధానుల అంశంలో మరో ముందడుగు అంటూ సోషల్ మీడియాలో వైసిపి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నది.

న్యాయ రాజధానికి, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాలకు సంబంధం ఏమిటి? న్యాయ రాజధాని అంటే హైకోర్టు ఉంటుందని అర్ధం. మరీ అయితే రాష్ట్ర స్థాయి కోర్టులు ఏవైనా ఉంటే వాటిని కూడా కర్నూలు లో పెట్టుకోవచ్చు. వాటికి సంబంధించిన కార్యాలయాలు ఏవైనా ఉంటే వాటిని కర్నూలులో పెట్టుకోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లాంటివి ఏర్పాటు చేయాలంటే అక్కడ పెట్టుకోవచ్చు కూడా.

అంతే కానీ, కమీషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, విజిలెన్సు కమిషనర్ కార్యాలయాలకు న్యాయ రాజధానికి సంబంధమే లేదు. వీటిని కర్నూలుకు ఎందుకు తరలిస్తున్నారో అర్ధం కాదు. ఈ విధంగా చేయమని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎవరైనా సలహా ఇచ్చారా లేక ఆయనే సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? ఎవరైనా సలహా ఇస్తే ఆ సలహాదారుడిని తక్షణమే తీసేయాలి. లేదా సిఎం స్వయంగా నిర్ణయం తీసుకుని ఉంటే ఆయన పరిపాలన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అర్ధం.

ఇలాంటి అరకొర నిర్ణయాల వల్ల మూడు రాజధానుల కాన్సెప్టు అభాసుపాలు కావడం తప్పదు. విజిలెన్సు కమిషనర్ కు న్యాయ విభాగానికి అస్సలు సంబంధం ఉండదు. అవినీతి నిరోధక శాఖ కు సిఫార్సులు చేస్తూ ఉండేదే విజిలెన్సు కమిషనర్ కార్యాలయం. వారికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు విజిలెన్సు కమిషనర్. అదే విధంగా ప్రభుత్వ శాఖల్లో జరిగే అవినీతి కార్యక్రమాలపై నిఘా వేయడం, సంబంధిత శాఖల నుంచి రిపోర్టులు తెప్పించుకోవడం వాటిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించడం విజిలెన్సు కమిషన్ చేస్తూ ఉంటుంది. అంతే తప్ప ఈ విభాగానికి కోర్టులకు సంబంధం లేదు. ఇది సెక్రటేరియేట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అంత్యంత లోప భూయిష్టంగా జరిగిన ఈ చర్య వై ఎస్ జగన్  ప్రభుత్వానికి కచ్చితంగా చెడ్డపేరు తెస్తుంది.

Related posts

తెలుగు తెరకు తిరుగులేని విలన్: హ్యారి జోష్

Satyam NEWS

ఫేక్ ప్రాపగాండ చేసే ఏ ఒక్కడినీ వదిలిపెట్టను

Bhavani

చిన్నశేషవాహనంపై శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

Satyam NEWS

Leave a Comment