27.7 C
Hyderabad
May 11, 2024 10: 53 AM
Slider విజయనగరం

సీపీఎం వెర్సస్ వైసీపీ: విజయనగరం లో ‘కుల రాజకీయాలు’

#waterplant

నిజమైన దళిత పక్షం కమ్యూనిస్టులేనని వామపక్ష పార్టీలు గొంతెత్తుతున్నాయి. పేదల పట్ల అణగారిన వారి పట్ల అండగా ఉండేది సీపీఎంయేనని ఆ పార్టీ నేతలు నొక్కి చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే…విజయనగరం లో అయ్యప్ప నగర్ లో నిర్మాణ మైన వాటర్ ప్లాంట్ విషయంలో అధికార వైఎస్సార్సీపీ వెర్సస్ సీపీఎం మధ్య గలటా రాజుకుంది. ఇటీవల జరిగిన “స్పందన” లో నగర కార్పొరేటర్… అధికార పార్టీ నేత…”కులం” కార్డ్ బయటకు తీయడం తో రచ్చరచ్చ అయి….చివరకు దళితులకు అండగా నిలిచేది… “మేమంటే మేము” అంటూ వాదోపవాదాల వరకు వెళ్లడం విశేషం.

అయితే విజయనగరం అయ్యప్ప నగర్లో అక్రమ వాటర్ ప్లాంట్ సీజ్ చెయ్యాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలని దళిత, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ ఏకగ్రీవ తీర్మానం చేయడం మరో విశేషం. విజయనగరం అయ్యప్ప నగర్ లో పూసార్ల మధు నిర్వహిస్తున్న అక్రమ వాటర్ ప్లాంట్ వలన స్ధానిక ప్రజల ఇళ్ళల్లోబోర్లు ఇంకిపోయాయని తీవ్ర ఆందోళన చెందుతున్న అయ్యప్ప నగర్ లో ప్రజలు పోరాడుతుంటే, పట్టణ పౌర సంక్షేమ సంఘం,సీపీఎం ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచారు. వారిపై పూసర్ల మధు తన అక్రమ ప్లాంట్ ను రక్షించుకునేందుకు తన భార్యతోను  బావమరిది తోనూ తప్పుడు కేసులు పెట్టారని తక్షణమే  ఆ తప్పుడు ఎస్సీ, ఎస్టీ  అక్రమ కేసులు ఎత్తివేయాలని, అక్రమ వాటర్ ప్లాంట్ సీ జ్ చెయ్యాలనీ దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ, కొంత మంది దళిత సంఘాలు పేరుతో అక్రమ వాటర్ ప్లాంట్ యాజమాని పూసర్ల మధు తో కలసి సీపీఎం, పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారికీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చెపుతున్నాము, నిజమయిన దళిత పక్షం కమ్యూనిస్టులు అని, ఆలాగే సీపీఎం పార్టీ యే నిజమైన దళిత నేస్తమని, దళిత పక్షం అని అన్నారు, పూసపాటి రేగ మండలము కొవ్వాడ దళితులకు అండగా సీపీఎం నిలబడి పెత్తందార్లు నుండి దళితుల భూములు దళితులకు దక్కాయంటే సీపీఎం పోరాటమెనని, కొవ్వాడ దళిత సంఘాలు నాయకులు దేబార్కి అప్పారావు అన్నారు.

కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, అధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బాగ్గులదిబ్బ ధలితల మహిళనేత ఏకలమ్మ మాట్లాడుతూ బొగ్గులదిబ్బ లో పేదల పాకాలను తోలగిస్తే సీపీఎం దళితుల తరుఫున నిలబడింది. మరి ఆరోజు దళిత నాయకులు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. వీఆర్ఏ జిల్లా కార్యదర్శి, బచ్చల సర్యాన్నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాడి అప్పారావు, పంచాయితీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మద్ధిల రమణ, వేపాడ దళిత సంఘాలు నాయకులు రిక్కి అప్పరావు, కోట మండలం దళిత నాయకులు కప్పరెడ్డి వెంకట అప్పారావు, డెoకాడ ధలిత నాయకుల నిడిగంటి సూర్యనారాయణ, s. కోట సివరంపురం దళిత నాయకులు మోయ్యి వెంకటరమణ, జొన్న గుడ్డు, రామకృషా నగర్ నాయకులు . బలగ మోహన్, గంజిపెట, దళిత నాయకులు నూకమ్మ , కనపాక దళిత రెల్లిమహిలనాయకులు వసంత గౌరి, దళిత విద్యార్థి విభాగం నాయకుడు ముళ్ళు హర్ష, తది తరులు పాల్గొన్నారు, దళిత సంఘాలు కి, సీపీఎం కీ మధ్య తగాదా లాగ అధికారులూ చోద్యం చూస్తున్నారు.  తక్షనమే ఈ సమస్య పరిష్కారం చెయ్యాలనీ డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామనితెలిపారు.

Related posts

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై అమరావతి రైతుల ఫిర్యాదు

Satyam NEWS

గుడ్ న్యూస్:కరోనా వైరస్ కు చైనా విరుగుడు మందు

Satyam NEWS

విభజన హామీలు అమలు చేయాల్సిందే

Sub Editor 2

Leave a Comment